డ్రైనేజీ సమస్య తీరేది ఎప్పుడో.. 5 ఏళ్లుగా పట్టించుకోని అధికారులు,పాలకులు

అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లేక పారే మురికి నీటిలో దోమలకు ఈగలకు

Update: 2024-07-03 11:22 GMT

దిశ,యాచారం : అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లేక పారే మురికి నీటిలో దోమలకు ఈగలకు ఆవాసాలుగా మారి దుర్వాసనతో ప్రజలు రోగాల బారిన పడుతూ ఇబ్బందులు పడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. మండలం కేంద్రంలోని 3వ వార్డులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సీసీ రోడ్డు లేక తిప్పలు తప్పడం లేదు. ఐదేళ్ల క్రితం ఇంటింటికి నల్లా నీళ్లు ఇచ్చే క్రమంలో హనుమాన్ దేవాలయం వద్ద,సీసీ రోడ్డును తొలగించి మంచినీటి కలెక్షన్లు ఇచ్చారు. ఊరి చివర గా ఉండడంతో పైనుండి వచ్చే మురికి నీరు మొత్తాన్ని ఊరి చెరువులోకి తరలించేందుకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి పైపులు సైతం తీసుకువచ్చి అలాగే వదిలేశారు. ఆ మురికి నీరు తమ పొలాలలోకి వచ్చి పంటలు పండటం లేదంటూ రైతులు మురికి నీరు రాకుండా మట్టితో కట్టలు కట్టుకున్నారు. ఆ మురికి నీరు నిత్యం ముత్యాలమ్మ దేవాలయానికి వెళ్లే రోడ్డుపై పారుతోంది. దోమలకు ఈగలకు ఆవాసంగా మారింది అధికారులు కానీ పాలకులు గానీ పట్టించుకోవడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

మురికి నీటితో ఇబ్బందులు పడుతున్నాం : ముత్యాలమ్మ ఆలయ కమిటీ చైర్మన్ భూతరాజు అంజయ్య,

3 వార్డు ఊరికి చివరగా ఉండడంతో పైనుండి వచ్చే మురికినీరు ముత్యాలమ్మ ఆలయానికి వెళ్లే రోడ్డుపైన ప్రవహిస్తోంది. వాహనదారులు, కాలినడకన వెళ్లాలంటే మురికిలో వెళ్లక తప్పదు. దోమలు ఈగలతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు ఇప్పటికైనా డ్రైనేజీ కాలువలు నిర్మిస్తే బాగుంటుంది.


Similar News