మైనర్ బాలిక అదృశ్యం..గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు
అనుమానస్పద స్థితిలో 16 సంవత్సరాల మైనర్ బాలిక అదృశ్యమైన ఘటన పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
దిశ, బడంగ్ పేట్ : అనుమానస్పద స్థితిలో 16 సంవత్సరాల మైనర్ బాలిక అదృశ్యమైన ఘటన పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పహాడి షరీఫ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..జల్ పల్లి శ్రీ రామ్ కాలనీ కి చెందిన వినోద్ రామ్ చిన్న కుమార్తె అనూష కుమారి (16) గత నాలుగు నెలలుగా శ్రీరామ్ కాలనీలోని పేపర్ మేకింగ్ కంపెనీ లో పనిచేస్తుంది. ఈ నెల 15 వ తేదీన రాత్రి అనూష కుటుంబ సభ్యులతో కలిసి ఎప్పటిలాగే భోజనం చేసి పడుకుంది. మరునాడు ఉదయం 5 గంటలకు లేచి చూసే సరికి చిన్న కూతురు అనూష కనిపించలేదు. దీంతో కంగారు పడ్డ కుటుంబసభ్యులు అనూష అచూకీ కోసం వెతికినప్పటికీ ప్రయోజనం కనిపించకపోవడంతో.. పహాడి షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు పహాడిషరీఫ్ పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.