బావమరుదులను చితకబాదిన బావ..అసలేం జరిగిందంటే..?

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో అక్కను వేధించిన తమ్ముడిని,బావమరుదులను బావ చితకబాదాడు

Update: 2024-12-11 13:24 GMT

దిశ, ఇబ్రహీంపట్నం : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో అక్కను వేధించిన తమ్ముడిని,బావమరుదులను బావ చితకబాదాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..తొర్రుర్ గ్రామానికి చెందిన నిట్టు వరమ్మ లక్ష్మయ్యల కూతురు నిట్టు సుమధురను శేరిగూడ గ్రామానికి చెందిన క్యామ రాఘవేందర్ తో వివాహం జరిగింది.  అదే కుటుంబానికి చెందిన కజిన్ సోదరులు విజయ్, సాయి, సూర్యలు తమకు డబ్బులు కావాలని గత వారం రోజుల నుంచి ఆమెను వేధిస్తున్నారు. డబ్బులు ఇవ్వకపోతే ఒక నకిలీ ఇన్స్టాగ్రామ్ ఐడి సృష్టించి..ఫోటో మార్ఫీంగ్ చేస్తామని బ్లాక్ మెయిల్ చేశారు. దీంతో ఆమె తీవ్ర మనస్థాపనికి గురై తన భర్త రాఘవేందర్ విషయం చెప్పగా..ఇద్దరు కలిసి సుమధుర తల్లిగారైన నిట్టు వరమ్మ ఇంటికి తొర్రుర్ కు వెళ్లారు. రాఘవేందర్ తన కుటుంబ సభ్యులైన భరత్, విజయ్, కొమురయ్య, కృష్ణ తో పాటు..మరికొంత మంది వ్యక్తులుతో కలిసి తన బావమరుదులు విజయ్, సాయి, సూర్యని దగ్గరలోని నాగన్ పల్లి అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి దాడికి పాల్పడాడు. విజయ్, సాయి, సూర్య లను చెట్లకు కట్టేసి దాడి చేశారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఇరువురు కుటుంబలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా..దర్యాప్తు ప్రారంభించి పూర్తి వివరాలు త్వరలో వెళ్లాడిస్తామని పోలీసులు తెలిపారు.రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో అక్కను వేధించిన తమ్ముడిని,బావమరుదులను బావ చితకబాదాడు


Similar News