వచ్చే ఐదేళ్లలో 50 కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు చేయడమే లక్ష్యం : రామ్మోహన్ నాయుడు
వచ్చే ఐదేళ్లలో 50 కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు చేయడమే
దిశ,శంషాబాద్ : వచ్చే ఐదేళ్లలో 50 కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు చేయడమే లక్ష్యం అని కేంద్ర పౌర విమానాయ శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. బుధవారం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ పోర్ట్ ప్రొడక్టివ్ ఆపరేషన్ సెంటర్ ను కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, జిఎంఆర్ ఎయిర్పోర్ట్ ఐడి సౌత్ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ ఎస్ జికే కిషోర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హైదరాబాద్ హైదరాబాద్ విమానాశ్రయంలో ప్రత్యేకంగా ఈ బోర్డింగ్ సిస్టం ప్రారంభించి, మొబైల్ యాప్ లో స్మార్ట్ ట్రాలీ సిస్టం, స్మార్ట్ టాయిలెట్స్ ఎన్నో ఇతర సదుపాయాలు కల్పించిందన్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి సుమారు 90 దేశాలకు జాతీయ అంతర్జాతీయ రాకపోకలు కొనసాగుతున్నాయి అన్నారు. దేశంలోనే అత్యధిక ప్రయాణికులు రాకపోకలు కలిగే విమానాశ్రయం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అన్నారు.
ఈ విమానాశ్రయం నుంచి రోజుకు దాదాపు 500 విమానాలు రాక పోకడల కొనసాగిస్తున్నాయన్నారు. అప్పట్లో 5000 ఎకరాల భూసేకరణ అంటే సాధ్యమైన విషయం కాదని అవహేళన చేశారని, అలాంటి దాన్ని చంద్రబాబు నాయుడు సాధ్యం చేశారన్నారు. చంద్రబాబు దర్శన్ కథ వల్లే శంషాబాద్ ఎయిర్ పోర్ట్ సాధ్యమైందన్నారు. దేశంలో ఐటీ విప్లవం వెనుక చంద్రబాబు కృషి ఎంతైనా ఉందన్నారు. ఇప్పటికీ దేశాభివృద్ధికి ఐటీ చోదన శక్తి అని చంద్రబాబు నమ్ముతారన్నారు. రాబోయే ఐదు సంవత్సరాలలో దేశంలో 50 కొత్త విమానాశ్రయాలు నెలకొల్పడమే లక్ష్యంగా పని చేస్తామన్నారు.
జీఎంఆర్ ఎయిర్పోర్ట్ ఐడి- సౌత్ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ ఎస్జీకే కిషోర్ మాట్లాడుతూ జిఎంఆర్ గ్రూప్ అత్యధిక సాంకేతిక ఆవిష్కరణలతో విమానయాన పరిశ్రమకు నాయకత్వం వహిస్తుందన్నారు. ప్రయాణికుల అనుభవాలను గణనీయంగా పెంచడంపై దృష్టి పెడుతుందన్నారు. మా కొత్త ఏఐ ఆధారిత డిజిటల్ ప్లాట్ ఫామ్, ఎయిర్పోర్ట్ ప్రొడక్టివ్ ఆపరేషన్ సెంటర్ కార్యకలాపాలను ఆధునికరించడంలో ప్రయాణికుల సంతృప్తిని పెంచడంలో కొత్త ప్రయాణాలను నెలకొల్పాయ అన్నారు. రియల్ టైం డేటా అధునాతన విశ్లేషణలు సమీకృతం చేయడం ద్వారా మేము సజావుగా ప్రవాహం తగ్గిన నిరీక్షణ సమయం వ్యక్తిగతీకరించిన సేవలను నిర్ధారిస్తామన్నారు అసమాన సామర్థ్యం భద్రతతో విమాన ప్రయాణం యొక్క భవితవ్యంలో రూపొందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో విమానాశ్రయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.