అధికారుల అలసత్వం.. ప్రమాదానికి నిదర్శనం

షాద్ నగర్ బైపాస్ రోడ్ లో స్కూల్ నుండి విద్యార్థుల

Update: 2024-12-11 14:57 GMT

దిశ,షాద్ నగర్ : షాద్ నగర్ బైపాస్ రోడ్ లో స్కూల్ నుండి విద్యార్థులను ఇంటికి తీసుకెళ్తున్న ఆటో బ్రేకులు ఫెయిల్ అయ్యి రోడ్డు కిందకు వెళ్లి రెండు స్తంభాల మధ్య ఇరుక్కుపోయింది.దాంట్లో ఉన్న విద్యార్దులు పెద్దగా అరవడంతో అటుగా వెళ్తున్న వాహనదారులు వాహనంలో ఇరుక్కుపోయిన విద్యార్దులను రక్షించి బయటకు తీసుకొచ్చారు.విద్యార్దులు చదువుకోవడానికి ధూసకల్ గ్రామం నుండి ప్రతి రోజూ షాద్ నగర్ పట్టణంలో ఒక ప్రైవేటు పాఠశాలకు వచ్చి వెళ్తుంటారు.ప్రమాదం లో విద్యార్దులు ఎవరికి ఏమి కాకపోవడంతో తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు.టాటా వాహనంలో పరిమితికి మించి విద్యార్థులను తరలించడం వాహనానికి ఫిట్నెస్ ఉందా లేదా అనేది కూడా విద్యార్థుల తల్లిదండ్రులను తొలుస్తున్న ప్రశ్న.ఇది ఇలా ఉంటే పాఠశాల విద్యార్థులను తరలించే ప్రైవేటు వాహనాలపై స్కూల్ పిల్లలను తరలించే వాహనమని పేరు ఉండాలి కానీ ఎక్కడ కూడా లేదు. పెద్దగా ప్రమాదం ఏమి జరగకపోవడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.సంబంధిత అధికారుల వైఫల్యం కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి అని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.


Similar News