ప్రమాదం అంచున విద్యార్ధుల ప్రయాణం.. ఆందోళనలో తల్లిదండ్రులు..
ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు విద్యార్ధుల ప్రాణాలతో చెలగాటాలు ఆడుతున్నారు.
దిశ, షాద్ నగర్ : ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు విద్యార్ధుల ప్రాణాలతో చెలగాటాలు ఆడుతున్నారు. ఆటోలో పరిమితికి మించి విద్యార్థులను తరలిస్తున్నారు. వేలకు వేలు ఫీజు దండుకునే యాజమాన్యాలు విద్యార్థుల భద్రత పై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నిత్యం ఏదో ఒకచోట ప్రమాదాలు జరుగుతున్నా తమకేమీ పట్టనట్లు ప్రమాదం జరిగినప్పుడు చూసుకుందాంలే అనే ధోరణిలో ఉన్నారనేది స్పష్టంగా అర్థం అవుతుంది. పిల్లల భవిష్యత్తు బాగుండాలని తల్లిదండ్రులు కాయ కష్టం చేసి తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలో చదివిస్తున్నారు.
విద్యార్థులు ప్రయాణించే వాహనం పాఠశాలకు సంబంధించినది అని తెలిసేలా బోర్డు ఏర్పాటు చేయాలని నిబంధనలు ఉన్నాయి. ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారు ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రమాదకరంగా విద్యార్థులను ఆటోలలో తరలిస్తున్న యాజమాన్యాల పై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.