వీధి కుక్కల దాడి.. 10 గొర్రె పిల్లలు మృతి

వీధి కుక్కల దాడిలో 10 గొర్రె పిల్లలు మృతి చెందాయి.

Update: 2024-11-05 15:39 GMT

దిశ, బొంరాస్ పేట్ : వీధి కుక్కల దాడిలో 10 గొర్రె పిల్లలు మృతి చెందాయి.ఈ ఘటన బొంరాస్ పేట మండలంలోని గట్టేగాని తండాలో చోటుచేసుకుంది. తండాకు చెందిన కేతావత్ ఫుల్ సింగ్ వ్యవసాయం చేస్తూ,గొర్రెలను కాసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.రోజు మాదిరిగానే,మంగళవారం గొర్రెలను మేపడానికి వెళ్లారు. ఇంటి దగ్గర ఎవరు లేకపోవడంతో,గంప(జల్ల)కింద ఉంచిన,గొర్రె పిల్లల దగ్గరకు కొన్ని వీధి కుక్కలు వచ్చి దాడి చేశాయి.దీంతో 10 గొర్రె పిల్లలు మృతి చెందాయి.రాత్రి ఇంటికి వచ్చిన ఫుల్ సింగ్ కి మృత్యువాత పడ్డ గొర్రె పిల్లలు కనిపించాయి.దీంతో చేసేదేమీ లేక లబోదిబోమంటూ కంటతడి పెట్టాడు. చుట్టుపక్కల తండాలలో కుక్కల బెడద నివారణకు, అధికారులు చర్యలు తీసుకోవాలని,ఆయా తండాల వాసులు కోరుతున్నారు.

Tags:    

Similar News