ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలి.. మంత్రి సబితా ఇంద్రారెడ్డి
దిశ, శంకర్పల్లి: ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. ఆదివారం శంకర్పల్లి మండలంలోని మహాలింగాపురం గ్రామంలో నిర్వహించిన పోచమ్మ జాతర, జన్వాడ గ్రామంలో నిర్వహించిన అయ్యప్ప మహా పడిపూజ కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూజలు చేసి మొక్కలు తీర్చుకున్నారు. తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం మంత్రి సబిత మాట్లాడుతూ.. దేవాలయాలు సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకలని వివరించారు. జాతరను ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, జెడ్పీటీసీ గోవిందమ్మ గోపాల్ రెడ్డి, ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి, సొసైటీ చైర్మన్ బద్దం శశిధర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పాపారావు, శంకర్పల్లి మున్సిపల్ చైర్ పర్సన్ సాత విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు గోపాల్, మహాలింగాపురం సర్పంచ్ మాణిక్ రెడ్డి, ఎంపీటీసీ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.