అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు.. ఏడి సత్యనారాయణ

ప్రభుత్వ నిబంధన ప్రకారమే రవాణా చేయాలి.. అక్రమ రవాణా చేసే కఠిన చర్యలు తప్పవని తాండూరు మైనింగ్ శాఖ ఏడీ సత్యనారాయణ అన్నారు.

Update: 2024-11-22 16:20 GMT

దిశ, తాండూరు : ప్రభుత్వ నిబంధన ప్రకారమే రవాణా చేయాలి.. అక్రమ రవాణా చేసే కఠిన చర్యలు తప్పవని తాండూరు మైనింగ్ శాఖ ఏడీ సత్యనారాయణ అన్నారు. తాండూరు మండలంలో ఒక వాహనానికి 42,685 రూపాయలు, పెద్దేముల్ మండలం ఘాజీపూర్ దగ్గర మరో వాహనానికి 3,620 రూపాయలు జరిమానా వేసినట్లు తాండూర్ మైనింగ్ శాఖ ఏడీ సత్యనారాయణ వెల్లడించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అక్రమ మైనింగ్, అక్రమ రవాణాలను పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వానికి బిల్లులు చెల్లించి వ్యాపారం చేసుకునే ఆలోచన ప్రతీ ఒక్కరిలో రావాలన్నారు.


Similar News