దిశ ఎఫెక్ట్.. స్పందించిన అధికారులు..
శంకర్ పల్లిలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తం అనే శీర్షికతో ఈనెల 22వ తేదీన దిశ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి మున్సిపల్ కమిషనర్ స్పందించారు.
దిశ, శంకర్ పల్లి : శంకర్ పల్లిలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తం అనే శీర్షికతో ఈనెల 22వ తేదీన దిశ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి మున్సిపల్ కమిషనర్ స్పందించారు. శుక్రవారం ఉదయమే మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బందితో వెళ్లి పరిశుభ్రం చేయించారు. ఈ సందర్భంగా కమిషనర్ శ్రీనివాస్ మాట్లాడుతూ మున్సిపల్ కార్యాలయానికి సంబంధించిన చెత్త సేకరణ వాహనాలలోనే చెత్తను వేయాలని సూచించారు.
ప్రజలు తమ ఇళ్లలో నిలువ ఉంచిన చెత్తను మున్సిపల్ చెత్త బండ్లలో వేయాలని రోడ్ల పై ఎక్కడపడితే అక్కడ పారవేయరాదని సూచించారు. రోడ్డు పక్కన ఎక్కడ పడితే అక్కడ చెత్తను పారవేయడం ద్వారా పరిసరాలు అపరిశుభ్రంగా మారి ప్రజలే అనారోగ్య బారిన పడే అవకాశం ఉందని అన్నారు. పారిశుద్ధ్య నివారణకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్లు వివరించారు.