ఇందిరమ్మ కమిటీలో సీనియర్లకు అవకాశం కల్పించాలి.. బొంగు వెంకటేష్ గౌడ్

ఇందిరమ్మ కమిటీలలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పార్టీ అధికారంలోకి రావడానికి కష్టపడిన నాయకులకు, కార్యకర్తలకు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో అవకాశం కల్పించాలని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నదని రంగారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి బొంగు వెంకటేష్ గౌడ్ సోమవారం ఓ ప్రకటనలో అన్నారు.

Update: 2024-11-04 06:47 GMT

దిశ, అబ్దుల్లాపూర్ మెట్ : ఇందిరమ్మ కమిటీలలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పార్టీ అధికారంలోకి రావడానికి కష్టపడిన నాయకులకు, కార్యకర్తలకు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో అవకాశం కల్పించాలని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నదని రంగారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి బొంగు వెంకటేష్ గౌడ్ సోమవారం ఓ ప్రకటనలో అన్నారు. గత 30 ఏళ్లుగా పార్టీ అధికారంలో లేకపోయినా కష్టకాలంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న పార్టీ జెండానే నమ్ముకుని ఉన్న కార్యకర్తలకు ఇందిరమ్మ ఇండ్ల కమిటీలో అవకాశం కల్పించాలని ఆయన కోరారు.

రంగారెడ్డి జిల్లా పరిధిలోని గ్రామ పంచాయతీ మండల కమిటీ, వార్డ్ కమిటీలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిందన్నారు. అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి ఇందిరమ్మ కమిటీలో లబ్ధిదారులకు అవకాశం కల్పించాలని అన్నారు . ఎన్నో ఏళ్లుగా పార్టీ జెండాను మోసిన వారిని కాదని పారాచూట్లగా పార్టీ మారి వచ్చిన నాయకులకు ఇందిరమ్మ ఇండ్ల కమిటీలో అవకాశం కల్పించవద్దు అని అన్నారు. పార్టీ పట్టిష్ట కోసం పనిచేస్తున్న నాయకులను పరిగణలోకి తీసుకోవాలని కోరారు. పార్టీ క్యాడర్ పట్ల అవగాహన లేని నాయకులకు అవకాశం కల్పిస్తే పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని తెలిపారు.

ఇందిరమ్మ కమిటీలో ఎవరికి అవకాశం ఇస్తారో అంటూ పార్టీ కార్యకర్తలు అయోమయంలో ఉన్నారని పార్టీకి అందుబాటులో ఉండే కార్యకర్తలకు నాయకులకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. గత కొన్నేళ్లుగా పార్టీని నమ్ముకున్న వారికి కాకుండా పార్టీ మారి వచ్చిన వారికి ఇందిరమ్మ ఇండ్ల కమిటీలో అవకాశం కల్పిస్తే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కి, పార్టీ పెద్దలు దృష్టికి తీసుకెళ్తాను అన్నారు.

Tags:    

Similar News