MLA : సన్నవడ్లకు రూ.500 బోనస్

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి క్వింటా సన్నవడ్లకు రూ.500 బోనస్​ అందజేస్తామని పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్​ రెడ్డి అన్నారు.

Update: 2024-11-03 13:53 GMT

దిశ,పరిగి : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి క్వింటా సన్నవడ్లకు రూ.500 బోనస్​ అందజేస్తామని పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్​ రెడ్డి అన్నారు.పరిగిలో ఆదివారం వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. పీఏసీఎస్​, డీసీఎంఎస్, ఐకేపీ సెంటర్లలో కొనుగోలు చేసే సన్న వడ్ల రకం 2030 ఏ గ్రేడ్ కు రూ. 2320 +500 ఇవ్వనున్నామన్నారు.రూ. 2 లక్షల రుణమాఫీ కానీ రైతుల జాబితాను తయారు చేసి బ్యాంకు, అగ్రికల్చర్​ అధికారులకు అందజేశామన్నారు. రెండు లక్షలకు పైగా డబ్బులు ఉన్న రైతులు పై అమౌంట్​ కడితే రుణమాఫీ జరుగుతుందన్నారు. 2018 కంటే ముందు పంట రుణాలు ఉన్న రైతులు వాళ్ల బాకీలోసగం కడితే మిగతా సగం మాపీ అయ్యేలా బ్యాంకు అధికారులు ఒప్పుకున్నారన్నారు. అంతేకాకుండా ఇందిరమ్మ ఇళ్ల కమిటీలు ఏర్పాటు చేశామని సమాజంలో అట్టడుగు వర్గాల వారు, పేదవారు, కాంగ్రెస్​ పార్టీ పటిష్టతకు కృషి చేసిన వారిని ఆ కమిటీలు లబ్దిదారులుగా గుర్తిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్​ మండల పార్టీ అధ్యక్షుడు పరశురాం రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి మూల సత్యనారాయణ రెడ్డి, మాజీ వైస్​ ఎంపీపీ కావాలి సత్యనారాయణ, నారాయణరెడ్డి, దండు అశోక్​,తావుర్యా నాయక్​, మల్లేష్​, జరుపుల శ్రీనివాస్​, డీసీఎంఎస్​ వెంకటేష్​ రైతులు పాల్గొన్నారు.


Similar News