మూడు రోజుల్లో రూ.116 కోట్ల మద్యం సేల్​..ఎక్కండంటే..?

2024 సంవత్సరానికి వీడ్కోలు​ చెబుతూ.. 2025 నూతన

Update: 2025-01-01 16:10 GMT

దిశ,రంగారెడ్డి బ్యూరో: ​2024 సంవత్సరానికి వీడ్కోలు​ చెబుతూ.. 2025 నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ జిల్లాలో సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా రంగారెడ్డి, వికారాబాద్​ జిల్లాలో మూడు రోజుల పాటు జరిగిన మద్యం అమ్మకాల్లో రూ.116 కోట్ల ఆదాయం ఎక్సైజ్​ శాఖకు వచ్చినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇందులో 93,725 లిక్కర్​.. 1,18,447 బీర్​ కేసులు విక్రయించారు. కానీ గత ఏడాది ఈ మూడు రోజుల్లో రూ.117.32 కోట్లు మద్యం అమ్మకాలు జరిగాయి. 98,266 లిక్కర్​.. 1,03,538 బీర్ల కేసులు సెల్​ చేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. 2023 డిసెంబర్​ 29, 30,31 తేదీల్లో 2024 డిసెంబర్​ 29,30,31 తేదీల్లో విక్రయించిన మద్యం సెల్​ తో పోలిస్తే రూ.1 కోటి 12 లక్షల ఆదాయం నష్టం వచ్చినట్లు తెలుస్తోంది.

శంషాబాద్​ సర్కిల్లోనే అత్యధిక ఆదాయం...

రంగారెడ్డి, వికారాబాద్​ జిల్లాలో మూడు ఎక్సైజ్​ సర్కిల్. అవీ సరూర్​నగర్​, శంషాబాద్​ వికారాబాద్​ సర్కిళ్లు కాగా వీటి పరిధిలో 14 పోలీస్​ స్టేషన్లు ఉన్నాయి. శంషాబాద్​ సర్కిల్​లో మూడు పోలీస్​ స్టేషన్ నుంచి శంషాబాద్​, శేరిలింగంపల్లిలో పూర్తిగా అర్బన్, చేవెళ్ల రూరల్​​ ప్రాంతంలోనే ఉన్నాయి. అయితే అర్బన్​ ప్రాంతాలైన శేరిలింగంపల్లి, శంషాబాద్​ పోలీస్ స్టేషన్​ పరిధిలోని మద్యం షాపుల్లో విక్రయాలు జోరుగా జరిగినట్లు తెలుస్తోంది. శంషాబాద్​ సర్కిల్​ పరిధిలో 41,414 లిక్కర్​, 53337 బీర్​ కేసులు విక్రయిస్తే రూ.56.77కోట్ల ఆదాయం ఎక్సైజ్​ శాఖకు వచ్చింది. కానీ ఒక్క శేరిలింగంపల్లి పోలిస్​ స్టేషన్​ పరిధిలోనే 18,766 లిక్కర్​.. 25,503 బీర్​ కేసులు విక్రయిస్తే రూ.28.69కోట్లు వచ్చింది. ఈ స్టేషన్​ పరిధిలో లిక్కర్​ కంటే బీర్​ కేసులు అత్యధికంగా విక్రయించినట్లు తెలుస్తోంది. సరూర్​నగర్​ సర్కిల్​ పరిధిలో ఆరు పోలీస్ స్టేషన్లుండగా సరూర్​నగర్​, హయత్​నగర్​, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, ఆమనగల్​, షాద్​నగర్​ పరిధిలోనున్నాయి.

అయితే ఈ సర్కిల్​ పరిధిలో సరూర్నగర్​ తప్ప మిగిలిన ఐదు పోలిస్​ స్టేషన్లు రూరల్​ ప్రాంతంలోనే ఉన్నాయి. 42,563 లిక్కర్​.. 49,966 బీర్​ కేసులు విక్రయిస్తే రూ.49.58కోట్ల ఆదాయం మాత్రమే వచ్చిందని లెక్కలు చెబుతున్నాయి. అదేవిధంగా వికారాబాద్​ సర్కిల్​ పరిధిలో వికారాబాద్​, పరిగి, తాండూర్​, మోమిన్​పేట్​, కొడంగల్​ ఐదు పోలీస్​ స్టేషన్లు ఉన్నాయి. ఈ సర్కిల్ పరిధిలో 9748 లిక్కర్​.. 15144 బీర్​ కేసులు విక్రయిస్తే కేవలం రూ.9.75కోట్ల ఆదాయం తో సర్దుకున్నారు. కానీ అదే సీఎం నియోజకవర్గమైన కొడంగల్​ ఎక్సైజ్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో 1026 లిక్కర్​.. 2255 బీర్​ కేసులు విక్రయిస్తే రూ.1.13కోట్లు ఆదాయం వచ్చింది. గతేడాదితో పోలిస్తే లిక్కర్​ 4శాతం సేల్​ తగ్గింది. కానీ 28శాతం బీర్​ విక్రయం పెరిగింది.

తగ్గిన ఎక్సైజ్​ ఆదాయం...

రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్​ అధికారులు ఆశించిన స్థాయిలో డిసెంబర్​ 29,30,31 తేదీల్లో ఆదాయం రాలేదనే చర్చ సాగుతుంది. సాధారణంగా రోజూ వారీగా వచ్చే ఆదాయంలాగే నూతన సంవత్సర వేడుకలు జరిగినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా పెద్దగా మద్యం సేల్​ లేదని లెక్కలు చెబుతున్నాయి. రంగారెడ్డి, వికారాబాద్​ జిల్లాలు నగరానికి అతి దగ్గరలో ఉన్నందుకు ప్రముఖులు, రాజకీయ నాయకులు, ఉద్యోగస్తులు, వివిధ రంగాల్లో పనిచేసే వ్యక్తులు గెట్​ టుగెదర్​ పార్టీలు పెట్టుకుంటారు. కానీ ఈ ఏడాది వేడుకలు భారీగా జరిగినట్లు కనిపించిన మద్యం సేల్​ పెద్దగా లేదని తెలుస్తోంది. అంతేకాకుండా దసరా పండుగ సందర్భంగా జరిగిన సెల్​ను కూడా దాటలేదని అధికారులు అంచనా వేస్తున్నారు.


Similar News