Disha Effect : స్పందించిన తహసీల్దార్
లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పట్టిస్తే డీలర్ షిప్ రద్దు చేస్తామని బషీరాబాద్ తహసీల్దార్ వై వెంకటేష్ అన్నారు.
దిశ, బషీరాబాద్: లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పట్టిస్తే డీలర్ షిప్ రద్దు చేస్తామని బషీరాబాద్ తహసీల్దార్ వై వెంకటేష్ అన్నారు. ‘దిశ’ ఆన్లైన్ పత్రికలో ప్రచురితమైన "అక్రమ రేషన్ తరలింపు ఆపేది ఎవరు "అనే కథనానికి తహసీల్దార్ స్పందించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం డీలర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ.. రేషన్ బియ్యం అక్రమంగా దళారులకు అమ్ముకుంటున్న డీలర్లకు తమ డీలర్ షిప్ రద్దు చేస్తామని తహసీల్దార్ పేర్కొన్నారు. ప్రతి నెల ఒకటో తారీకు నుంచి 15వ తేదీ వరకు లబ్ధిదారులకు రేషన్ సరఫరా చేయాలని అన్నారు. రేషన్ డీలర్లు రాజకీయ పార్టీలకు అతీతంగా వ్యవహరించరాదని సమావేశంలో పేర్కొన్నారు. రాజకీయ జోక్యం చేసుకుంటున్న డీలర్ల విషయం, అక్రమాలకు పాల్పడుతున్న డీలర్ల వివరాలను ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు.
డీలర్ కు నోటీసులు జారీ చేస్తాం…
మండల పరిధిలోని క్యాద్గిరా గ్రామానికి చెందిన డీలర్ భీమయ్య పలు రాజకీయ పార్టీలకు అతీతంగా పనిచేస్తు గ్రామంలో లబ్ధిదారులకు రేషన్ సరఫరా చేయడంలో అంతరాయం కలిగిస్తున్నాడని ఆయనపై వచ్చిన ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకొని నోటీసులు జారీ చేస్తామని తహసీల్దార్ పేర్కొన్నారు.