బుల్కాపూర్ నాలా కబ్జా అవుతుంటే పట్టించుకోరా..?
తమకు రాజకీయ బలం ఉంది. తమను ఎవరు ఏం చేయలేరు అని కొందరు కబ్జాకోరులు నాలాలను సైతం వదలడం లేదు.
దిశ, గండిపేట్ : తమకు రాజకీయ బలం ఉంది. తమను ఎవరు ఏం చేయలేరు అని కొందరు కబ్జాకోరులు నాలాలను సైతం వదలడం లేదు. నాలాలను సైతం ఆక్రమించుకొని అక్రమ కట్టడాలు కట్టేస్తున్నారు. బుల్కాపూర్ నాలా కబ్జాచేసి నిర్మాణాలు చేస్తుంటే అధికారులకు తెలిసి కూడా కనీసం పట్టించుకోకపోవడం రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులు కబ్జాదారులతో చేతులు కలిపారని స్థానికులు రెవెన్యూ అధికారుల పై ఇరిగేషన్ అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గండిపేట్ మండలం పరిధిలోని మణికొండ మున్సిపల్, మణికొండ మర్రిచెట్టు సమీపంలోని సర్వేనెంబర్ 262 బుల్కాపూర్ నాలా ఉన్నది. బుల్కాపూర్ నాలను మూసివేసి అమృత కన్స్ట్రక్షన్ నిర్మాణదారులు బుల్కాపూర్ నాలను మూసి నిర్మాణాలను చేస్తున్నారు. రెవెన్యూ అధికారులకు ఇరిగేషన్ అధికారులకు తెలిసి జరుగుతుంటే ఎందుకు ఆపడం లేదని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రానున్న కాలంలో బుల్కాపూర్ నాలా పలానా చోటు ఉండేదని పేపర్లలో బుక్కుల్లో చదువుకునే పరిస్థితిలు వస్తాయా అని స్థానిక ప్రజలు పేర్కొంటున్నారు. బుల్కాపూర్ నాలను ఆనుకొని నిర్మాణం చేస్తున్న బఫెలో 40మీటర్లు ఉండాలని స్థానికులు చెబుతున్నా, అధికారులు 20 మీటర్లు అంటున్నారు. అధికారులు చెప్పిన లెక్కప్రకారం అయినా అక్కడ బఫర్ జోన్ విడిచి నిర్మాణాలు చేస్తున్నారు అంటే అదిలేదు.
అధికారులు వస్తే వారిని ఎలాబుట్టలో వేసుకోవాలో నిర్మాణదారులకు కొట్టినపిండి అని స్థానిక ప్రజలు తెలుపుతున్నారు. అక్కడ బుల్కాపూర్ నాలా ఉన్నప్పటికీ ఆయా నిర్మాణాలకు మణికొండ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ నుండి, ఇరిగేషన్ అధికారులు, రెవెన్యూ అధికారులు అనుమతులు ఎలా ఇస్తారు అని స్థానిక ప్రజలు అడుగుతున్నారు. అనుమతులు లేకుండానే నిర్మాణాలు చేస్తుంటే ప్రశ్నించాల్సిన అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడం అక్రమ నిర్మాణదారులకు వరంగా మారిందని స్థానిక ప్రజలు తెలుపుతున్నారు.నాలాల బఫర్ జోన్లో అధికార పార్టీ లీడర్ల సపోర్టుతో నిర్మాణాలు కొనసాగుతూనే ఉన్నాయి. గత ఏడాది చాలా కాలనీలు ముంపునకు గురికావడంతో నాలాలను విస్తరించేందుకు రెడీ చేసిన ప్రపోజల్స్ కాగితాలకే పరిమితమయ్యాయి. ప్రభుత్వ అనుమతులు రాక విస్తరణ ముందుకు సాగడంలేదు. నిర్మాణాలు కట్టుకోవాలంటే టీఎస్ బీపాస్ లో అప్లై చేసుకున్నప్పుడే చుట్టుపక్కల నాలాలు, చెరువులుంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా సమర్పించాలి. కానీ నిర్మాణదారుల నిర్మించే నిర్మాణం ముందు బుల్కాపూర్ నాలా ఉంటే నాలా నువ్వు పూర్తిగా పూడ్చివేసి దానిని ఆనుకొని నిర్మాణం చేస్తున్నారు అధికారులు ఇకనైనా నిద్రమత్తును వదిలి బుల్కాపూర్ నాలాను రక్షించాలని ప్రజలు కోరుతున్నారు.