పెద్ద అంబర్ పేట లో ఐటీ టవర్ తో ప్రాంత అభివృద్ధి ఖాయం...

పెద్ద అంబర్ పేట పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డు పరిసరాల్లో ఐటీ టవర్ ను ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుందని కాంగ్రెస్ నాయకులు అభిప్రాయపడ్డారు.

Update: 2025-01-07 10:42 GMT

దిశ, అబ్దుల్లాపూర్మెట్ : పెద్ద అంబర్ పేట పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డు పరిసరాల్లో ఐటీ టవర్ ను ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుందని కాంగ్రెస్ నాయకులు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు మంగళవారం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కి వినతి పత్రం అందజేశారు. స్పందించిన రంగారెడ్డి ఐటీ మినిస్టర్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు కు లేఖని రాశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ… ఎంతో కాలంగా అభివృద్ధికి నోచుకోకుండా ఈ ప్రాంతం అంధకారంలో ఉంటుందని అన్నారు. హైదరాబాదుకు నాలుగు దిక్కులలో భాగంగా ఒక విజయవాడ జాతీయ రహదారి పెద్ద అంబర్పేట పరిధి అభివృద్ధికి నోచుకోలేకపోతుందని అన్నారు. ఈ ప్రాంతంలో ఇటువంటి ఐటీ కంపెనీలు వస్తే అభివృద్ధి పథంలో వెళ్లడం ఖాయమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద అంబర్ పేట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొత్తపల్లి జైపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మన్నే నరసింహారెడ్డి, ఉడుగు సందీప్ గౌడ్, సయ్యద్ పాషా తదితరులు పాల్గొన్నారు.


Similar News