ప్రధాని మోడీకి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ

ప్రధాని మోడీకి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ లభిస్తుందని, దేశంలో అన్ని రాజకీయ పార్టీలకంటే బీజేపీ భిన్నమైనదని, సిద్ధాంతపరమైన రాజకీయాలు నడుపుతున్న ఏకైక పార్టీ అని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు.

Update: 2024-09-22 13:07 GMT

దిశ,మహేశ్వరం : ప్రధాని మోడీకి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ లభిస్తుందని, దేశంలో అన్ని రాజకీయ పార్టీలకంటే బీజేపీ భిన్నమైనదని, సిద్ధాంత పరమైన రాజకీయాలు నడుపుతున్న ఏకైక పార్టీ అని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మున్సిపాలిటీ కేంద్రంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు యాదిష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ ఎన్నికల ముందు బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే దేశంలో రిజర్వేషన్లు పోతాయని తప్పుడు మాటలు మాట్లాడారన్నారు. అమెరికా పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ విద్యార్థులతో మాట్లాడుతూ ఎస్సీ,ఎస్టీ ,బీసీలకు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను తాము సమయం వచ్చినప్పుడు తీసేస్తామనడాన్ని చూస్తే ఆయన నిజస్వరూపం బయట పడిందన్నారు.

     ప్రజాస్వామ్యంపై, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులపై రాహుల్ గాంధీ విషం చిమ్ముతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు దేశం, ప్రజల గురించి ఏనాడూ ఆలోచించలేదన్నారు. నేడు ప్రపంచ దేశాల చూపు భారతదేశం వైపు మళ్లీందన్నారు. కేంద్ర ప్రభుత్వం సబ్ కా సత్... సబ్ కా వికాస్ గా పనిచేస్తుందన్నారు. బీజేపీ అన్ని వర్గాల సంక్షేమం కోసం పాటుపడుతుందన్నారు. ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం ఉన్న ఏకైక పార్టీ బీజేపీ అని కొనియాడారు. ప్రధాని నరేంద్ర మోడీకి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ లభిస్తుందని, ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు ప్రతి గ్రామంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.

    రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉంటున్నారో వారికే అర్ధం కావడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సెవెళ్ల మహేందర్, బీజేపీ రాష్ట్ర నాయకులు తూళ్ల వీరేందర్ గౌడ్, అందెల శ్రీరాములు యాదవ్, బోసుపల్లి ప్రతాప్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, నాయకులు బోధ యాదగిరి రెడ్డి, మధుమోహన్ గుప్తా, రాఘవేందర్, దీలిప్ కుమార్ గౌడ్, దేవేందర్, పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.  

Tags:    

Similar News