డ్రగ్స్ రహిత క్యాంపస్ ఏర్పాటు కోసం అవగాహన కార్యక్రమాలు..
డ్రగ్స్ రహిత విశ్వవిద్యాలయ క్యాంపస్ ఏర్పాటు ధ్యేయంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఇక్ఫా యి విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్ లర్ ఎల్.ఎస్ గణేష్, డైరెక్టర్ డాక్టర్ కల్నల్ ఎస్పీ విశ్వనాథ్, రిజిస్టర్ డాక్టర్ ఎస్. విజయలక్ష్మి లు పేర్కొన్నారు.
దిశ, శంకర్ పల్లి : డ్రగ్స్ రహిత విశ్వవిద్యాలయ క్యాంపస్ ఏర్పాటు ధ్యేయంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఇక్ఫా యి విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్ లర్ ఎల్.ఎస్ గణేష్, డైరెక్టర్ డాక్టర్ కల్నల్ ఎస్పీ విశ్వనాథ్, రిజిస్టర్ డాక్టర్ ఎస్. విజయలక్ష్మి లు పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం దొంతాన్ పల్లి వద్ద గల ఇక్ఫాయి విశ్వవిద్యాలయం క్యాంపస్ లో ఐసీఎఫ్ఏఐ ఫౌండేషన్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ ( డీమ్డ్ టు బీ యూనివర్సిటీ ) హైదరాబాద్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఈవెంట్స్ నిర్వహించారు. డ్రగ్స్ తీసుకోవడం వల్ల కలిగే అనర్థాలు కళ్లకు కట్టినట్లు ఈవెంట్స్ నిర్వహించారు. జాయింట్ రిజిస్టార్ మధుసూదన్ రావు, పి.మురళి ఆధ్వర్యంలో ఎంబీఏ విద్యార్థులు ఈవెంట్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డ్రగ్స్ వాడకం వల్ల వ్యక్తుల జీవితాల్లో కలిగే హాని గురించి అవగాహన కల్పించడమే ఈ ఈవెంట్స్ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. కళాశాలలో డ్రగ్స్ రహిత వాతావరణం అందిపుచ్చుకునే కార్యక్రమంలో భాగమే ఈవెంట్స్ అని పేర్కొన్నారు.
ఈ మిషన్ లో భాగంగా ఎంబీఏ విద్యార్థులు డ్రగ్స్ వల్ల కలిగే భయానక పరిస్థితులను ప్రత్యక్షంగా వివరిస్తూ శక్తివంతకమైన నాటకం ప్రదర్శించి పలువురిని ఆకట్టుకున్నారు. ఈ కథలో ఒక యువతి కాలేజీ సీనియర్ల ప్రభావంతో డ్రగ్స్ కి బానిసవ్వడం ఆపై ఆమె భావోద్వేగ, శారీరక ఇబ్బందులను ఎదుర్కోవడం ప్రత్యక్షంగా కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఈ నాటక ప్రదర్శన డ్రగ్స్ వ్యసనాన్ని ఎదుర్కొన్న వారి నిజజీవిత పరిస్థితులను వెల్లడిస్తూ ప్రేక్షకులను డ్రగ్స్ వ్యతిరేకంగా నిలబడేందుకు ప్రేరేపించిందిగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కె వేణుగోపాల్, డి.సతీష్ డీన్, మోకిలా సర్కిల్ ఇన్స్పెక్టర్ వీరబాబు, ఎస్సై కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈవెంట్స్ లో ఎక్స్ప్రెషన్ జ్ థియేటర్ సొసైటీ, మనీ మ్యాటర్స్ క్లబ్, పిన్ స్ట్రీట్, సంకల్ప్, సీడబ్ల్యూ డి పాల్గొనగా ప్రధాన పాత్రధారులు నాటక తారలు వంశిక గోయెన్ కా, అమర్ అగర్వాల్, ప్రణవ్ మెహ్రోత్రా, ఇషిక డే, సహతారలు రిషిక అరోరా, సంజన పౌల్, అయ్యాం శర్మ, విగ్నేష్ తుమ్మారి, ప్రేరణ డే, సూర్యాంశ్ పౌల్ చౌదరి, శివాని, అహనా బనిక్, ఫరాజ్ అహ్మద్ ఖాన్, రాధిక చద్దా, అభిషేక్ గుప్తా, ప్రాంజలి హోరా, నైనా గుజ్రాల్, సంకేత్ తిబ్రేవాల్, అభిషేక్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.