తెలంగాణలో రామరాజ్యం రావాలంటే బీజేపీ అధికారంలోకి రావాల్సిందే..

తెలంగాణలో 9 సంవత్సరాల కేసీఆర్ పాలనలో అంతా అవినీతి, రాచరిక పాలన, కుటుంబ పాలన, నైజాం పరిపాలనలో ప్రజలు విసుగుచెంది ఉన్నారని మాజీ ఎమ్మెల్సీ తెలంగాణ బీజేపీ ఇంచార్జి పొంగులేటి సుధాకర్ రెడ్డి విమర్శించారు.

Update: 2023-02-26 10:46 GMT

దిశ, మొయినాబాద్ : తెలంగాణలో 9 సంవత్సరాల కేసీఆర్ పాలనలో అంతా అవినీతి, రాచరిక పాలన, కుటుంబ పాలన, నైజాం పరిపాలనలో ప్రజలు విసుగుచెంది ఉన్నారని మాజీ ఎమ్మెల్సీ తెలంగాణ బీజేపీ ఇంచార్జి పొంగులేటి సుధాకర్ రెడ్డి విమర్శించారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరు గ్రామంలో శక్తి కేంద్రాల ఇంచార్జి గున్నాల గోపాల్ రెడ్డి, మంచిరేవుల శ్రీరాములు ఆధ్వర్యంలో మండలపార్టీ అధ్యక్షుడు మామిడి మధుసూదన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ప్రజాగోస బీజేపీ భరోసా కార్నర్ మీటింగ్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తమిళనాడు బీజేపీ ఇంచార్జి మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో భారతదేశం అభివృద్ధిలో ఏ విధంగా ముందుకు దూసుకుపెతుందో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేశారు. కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను బూత్ అధ్యక్షులు ఇంటింటికి చేరవేయాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనలో ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైనట్లు ఆరోపించారు. రైతులకు రుణమాఫీ, నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, దళితులకు మూడెకరాల భూమి, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్న హామీ అమలు చేయడంలో తెలంగాణ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు.

చిలుకూరు గ్రామపంచాయతీకి గడిచిన నాలుగు సంవత్సరాలలో దాదాపు నాలుగు కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదల అయ్యాయని గుర్తు చేశారు. అదేవిధంగా అపోజిగూడ గ్రామపంచాయతీకి 74 లక్షల రూపాయల నిధులు కేంద్రప్రభుత్వం నుంచి మంజూరు కాగా అధికారంలో ఉన్నతెలంగాణ ప్రభుత్వ పెద్దలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా రాలేదని విమర్శించడం విచారకరమని అన్నారు. రాష్ట్రంలో అమలు జరుగుతున్న రైతు వేదికలు, డంపింగ్ యార్డులు పల్లె ప్రకృతి వనము, వైకుంఠ ధామాలు, రూర్బన్ పథకం కింద అమలు జరుగుతున్న పథకాలకు నిధులు ఎవరు ఇస్తున్నారని ప్రశ్నించారు. క్లస్టర్ గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న రైతువేదికలకు కేంద్ర ప్రభుత్వం నిధుల వాటా లేదని బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పగలుగుతారా అని అన్నారు. కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఐదు లక్షల రూపాయలు విలువ గలిగిన ఉచితవైద్యం అందించడం నిజం కాదా అని వారు ఆరోపించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు చేవెళ్ల అసెంబ్లీ ఇంచార్జి కంజర్ల ప్రకాష్, జిల్లా ఉపాధ్యక్షుడు జంగారెడ్డి, రాష్ట్ర నాయకులు శ్రీరామ్ నగర్ సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహారెడ్డి, జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, సీనియర్ నాయకులు శ్రీనివాస్ గౌడ్, దర్గా మహేందర్, మండల ప్రధాన కార్యదర్శి ఉపాధ్యక్షుడు రమేష్, కార్యదర్శిలు శేఖర్ గౌడ్ సీతారాంరెడ్డి, కిసాన్ మోర్చా అధ్యక్షుడు లక్ష్మీపతి యాదవ్, కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి, యువమోర్చా అధ్యక్షుడు శ్రీకాంత్, ఎంపీటీసీ రమ్యరాజు, మాజీ ఎంపీటీసీ సహదేవ్ గౌడ్, రమేష్, మల్లారెడ్డి మండల సోషల్ మీడియా ఇంచార్జి మల్లేష్ యాదవ్, బీజేవైఎం చంద్రశేఖర్ రెడ్డి, నరేందర్ యాదవ్, సీనియర్ నాయకులు భీమేందర్ రెడ్డి, తూర్పు శ్రీనివాస్ రెడ్డి, కుమ్మరి మహేందర్, మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News