డబుల్ ఇంజన్ సర్కారుతోనే తెలంగాణ అభివృద్ధి..

తెలంగాణ రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న అవినీతి, నిరంకుశ, నియంతృత్వ కుటుంబపాలనకు చరమగీతం పాడాల్సిన రోజులు దగ్గర పడ్డాయని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ అన్నారు.

Update: 2023-02-21 14:49 GMT

దిశ, బడంగ్ పేట్ : తెలంగాణ రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న అవినీతి, నిరంకుశ, నియంతృత్వ కుటుంబపాలనకు చరమగీతం పాడాల్సిన రోజులు దగ్గర పడ్డాయని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బూత్ నెంబర్ 282, 283, 284, 285 శక్తి కేంద్ర ఇంచార్జ్ మంత్రి మహేష్ ముదిరాజ్ ఆద్వర్యంలో జరిగిన ప్రజాగోస.. బీజేపీ భరోసా కార్నర్ మీటింగ్ కు ఆమె ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా రాణి రుద్రమదేవి మాట్లాడుతూ నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్రంలో అమలు జరగాలంటే రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ డబుల్ ఇంజన్ సర్కార్ రావాలన్నారు.

ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా తెలంగాణ ప్రజలను బీఆర్ఎస్ పార్టీ, ముఖ్యమంత్రి నట్టేట ముంచుతున్నాడని అన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయకుండా పేదప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్నాడని కేసీఆర్ పై ధ్వజమెత్తారు. నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి వ్యవసాయ రంగం అభివృద్ధికి రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, రైతుకు గిట్టుబాటు ధర, రామగుండం యూరియా ప్లాంటు, ఎరువుల సబ్సిడీ ద్వారా రైతులకు మేలుచేశారన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా మధ్యతరగతి ప్రజల ఇంటి నిర్మాణానికి కోట్ల రూపాయలు విడుదల చేశారన్నారు. రాష్ట్రంలో గ్రామపంచాయతీలకు, మున్సిపాలిటీలకు కార్పొరేషన్లకు నేరుగా ప్రత్యేక గ్రాంట్లను విడుదల చేస్తూ, స్వచ్ఛభారత్, మరుగుదొడ్లు, వీధి దీపాలు వాటికి ప్రత్యేక నిధులను విడుదల చేస్తుందన్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం ఒక ఎక్సైజ్ శాఖను మాత్రం బాగా అభివృద్ధి చేసి తాగుబోతుల రాష్ట్రంగా మార్చిందన్నారు. రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీని బూత్ స్థాయిలో బలోపేతం చేసి, మహేశ్వరం నియోజకవర్గంతో పాటుగా, తెలంగాణ రాష్ట్రంలో అధికారం సాధించేంతవరకు ప్రతి ఒక్కరు పాటుపడాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కర్యక్రమంలో అసెంబ్లీ కన్వినర్ యెల్మటి దేవేందర్ రెడ్డి, కార్పొరేషన్ అద్యక్షులు చెర్కుపల్లి వెంకట్ రెడ్డి, శక్తి కేంద్ర సహ ఇంచార్జి ఇర్వింటి శ్రీనివాస్ చారి, బూత్ అధ్యక్షులు కొండా శ్రవణ్ కుమార్, పల్స శ్రీకాంత్ గౌడ్, గట్టు నవీన్, తాళ్ల పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News