మునగనూరు స్థలాన్ని కాపాడండి..

జర్నలిస్టులకు కేటాయించిన ప్రభుత్వ స్థలాన్ని భూ కబ్జాదారులు మరోసారి కబ్జా చేసేందుకు స్థలంలో చొరబడుతున్నారు.

Update: 2022-10-19 11:31 GMT

దిశ, అబ్దుల్లాపూర్ మెట్ : జర్నలిస్టులకు కేటాయించిన ప్రభుత్వ స్థలాన్ని భూ కబ్జాదారులు మరోసారి కబ్జా చేసేందుకు స్థలంలో చొరబడుతున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులైన జర్నలిస్టులు తహసిల్దార్ కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం అబ్దుల్లాపూర్ మెట్ తహసిల్దార్ అనితారెడ్డిని కలిసి జర్నలిస్టులు వినతి పత్రాన్ని అందజేశారు. అబ్దుల్లాపూర్ మెట్ మండలం మునగనూరు గ్రామంలో ఉన్న సర్వేనెంబర్ 38/1 లో జర్నలిస్టులకు ప్రభుత్వం పట్టాలను మంజూరు చేసింది. కాగా ప్రభుత్వ స్థలంలో కొందరు కబ్జాదారులు చొరబడి నిర్మాణాలను కూల్చివేయడంతో పాటు సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా కబ్జాదారులు అక్రమాలకు పాల్పడుతున్నారని తాసిల్దార్ దృష్టికి తీసుకువెళ్లారు. స్థలాన్ని కబ్జా చేసేందుకు కుట్ర చేయడంతో పాటు జర్నలిస్టులపై భౌతిక దాడులకు కూడా పాల్పడుతున్న వారిపై చర్య తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కబ్జాదారులపై క్రిమినల్ కేసు నమోదు చేసి లబ్ధిదారులైన జర్నలిస్టులకు న్యాయం చేయాలని కోరారు. అందుకు స్పందించిన ఎమ్మార్వో అనిత రెడ్డి రెవెన్యూ చట్టప్రకారం అవసరమైన చర్యలు తీసుకుంటామని జర్నలిస్టులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు నాయకులు ప్రవీణ్ కుమార్, మేకల సత్యనారాయణ, కటకం సుభాష్, జంగయ్య యాదవ్, చెరుకు వెంకట్ స్వామి, దీన్ దయాల్, ముత్యాలు, శ్రీనివాసరావు, శ్రీనివాస్ గౌడ్, మధుసూదన్ రెడ్డి, చందర్, చండీశ్వర్, సాగర్ తదితరులు పాల్గొన్నారు.




Tags:    

Similar News