Pedda Amberpet: అక్రమాలకు అడ్డాగా పెద్ద అంబర్ పేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం
అక్రమాలకు అడ్డాగా పెద్ద అంబర్ పేట సబ్ రిజిస్ట్రార్
దిశ,అబ్దుల్లాపూర్మెట్ : అక్రమాలకు అడ్డాగా పెద్ద అంబర్ పేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం మారింది. కాసులు ఇస్తే ఎలాంటి కాగితాలనైన తారుమారు చేసే ప్రక్రియ కార్యాలయానికి దక్కిందని అనడంలో ఎలాంటి సందేహం లేదు. కింది స్థాయి వారితో అక్రమాల చేయిస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఉన్నతాధికారుల వ్యవహార శైలికి నిదర్శనంగా పెద్ద అంబర్ పేట మున్సిపాలిటీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వ్యవహరిస్తుందటంలో ఇలాంటి సందేహం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాసులు ఇస్తే మాత్రం ఒకరి పేరు మీద ఉన్న ప్లాట్ ను మరొకరు పేరు మీదకి ఇట్టే మార్పించేస్తున్నారు. చివరికి ఆధార్ కార్డు కేవైసీ తో సహా మార్పులు చేయిస్తూ ఒకరి ఫ్లాట్ ను మరొకరు ప్లేట్ కి పేరు మీదకి మార్చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఒక్కటి రెండు ప్లాట్ల విషయాల్లో హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో సైతం కేసులు నమోదైన ప్పటికీ అధికారుల్లో చలనం కనిపించడం లేదు.
పెద్ద అంబర్ పేట మున్సిపాలిటీ పరిధిలోని పెద్దిరాజు లేఔట్ పరిధిలో ఓ వ్యక్తి బతికుండగానే తన పేరు మీద ఉన్న కాగితాలను మరొక వ్యక్తి సృష్టించి వేరొకరికి రిజిస్ట్రేషన్ చేయించారు. రిజిస్ట్రేషన్ సమయంలో ఆధార్ కార్డు నెంబర్ సహా కేవైసీ కూడా తమకు అనుకూలంగా సృష్టించి ప్లాటుని రిజిస్ట్రేషన్ చేయించేశారు. చివరికి సదరు ప్లాట్ ఓనర్ కి విషయం తెలిసి పోలీసులను ఆశ్రయించడంతో పోలీసులు సదర వ్యక్తులపై కేసు నమోదు చేస్తూ అధికారులకు సైతం హెచ్చరికలు జారీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. కాసులు ఇస్తే ఎలాంటి పనులు చేయించడంలో పెద్ద అంబర్ పేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేసే సిబ్బంది సహా అధికారులు సిద్ధంగా ఉన్నారని స్థానికులకు ఆరోపిస్తున్నారు. పైగా ఈ విషయంలో ఒక్కో ప్లాట్ కి రూ.మూడు నుంచి ఐదు లక్షల వరకు చేతులు మారినట్లు విశ్వసనీయ సమాచారం. సదర్ ప్లాట్ ధర మార్కెట్ వాల్యూ నిజానికిరూ. 30 నుంచి 40 వేలు పలుకుతుండగా 300 గజాలు చొప్పున మూడు ప్లాట్లను ఇతరులకు రిజిస్ట్రేషన్ చేసినట్లు ఆధారాలు సైతం దొరకడంతో ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
ఇంత జరుగుతున్న తెలిసి తెలియనట్టు గా వ్యవహరిస్తున్న సబ్ రిజిస్టర్ అధికారి వ్యవహరిస్తున్న నిర్లక్ష్య వైఖరికి ఈ వ్యవహారం ఉదాహరణ మాత్రమే అని చర్చించుకుంటున్నారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే పెద్ద అంబర్ పేట సబ్ రిజిస్ట్రార్ పరిధిలో పరిధిలో ఇలాంటివి అనేకంగా ఉన్నట్లు స్థానికులు వాపోతున్నారు. కాగితాలను పూర్తిస్థాయిలో పరిశీలించాల్సిన అధికారి సైతం కాగితాలు పరిశీలించకుండా ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేస్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని సదర్ వ్యవహారంతో పాటు ఇటువంటి వ్యవహారాలపై ఒకన్నేసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా చూడాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయమై సబ్ రిజిస్టర్ సతీష్ కుమార్ వివరణ కోరగా కేవైసీలో సైతం సరైనవిగా చూపించడంతోనే రిజిస్ట్రేషన్ చేయించాల్సి వచ్చిందని ఇకపై ఇలాంటి పునరావతం కాకుండా చర్యలు తీసుకుంటామని వివరణ ఇచ్చారు.