పరిగి అంటేనే ప్రశాంతత
పరిగి పేరులోని ఫస్ట్అక్షరం పి అంటేనే పీస్ పుల్ అని ఇది మీ పరిగి 40 ఏళ్ల చరిత్ర చూస్తేనే తెలుస్తుందని జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి ఖితాబు ఇచ్చారు.
దిశ, పరిగి : పరిగి పేరులోని ఫస్ట్అక్షరం పి అంటేనే పీస్ పుల్ అని ఇది మీ పరిగి 40 ఏళ్ల చరిత్ర చూస్తేనే తెలుస్తుందని జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి ఖితాబు ఇచ్చారు. పరిగి మున్సిపల్ పరిధిలో బుధవారం ఓ రెస్టారెంట్ లో పీస్ కమిటీ ( శాంతి ) సమావేశం నిర్వహించారు. ఈ పీస్ కమిటీకి హిందూ, ముస్లిం, క్టిస్టియన్ మత పెద్దలు, వివిధ పార్టీల నాయకులు హాజరయ్యారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి మాట్లాడుతూ పిలవగానే వచ్చిన పరిగి పుర ప్రముఖులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. పరిగి మున్సిపల్ తోపాటు మండల వ్యాప్తంగా 40 ఏళ్లుగా పండుగలు ప్రశాంతంగా శాంతియుత వాతావరణంలో జరగడం చాలా సంతోషకరమన్నారు. మొదట మనమంతా భారతీయులం అని, కుల, మతాలన్నారు. ముఖ్యంగా వినాయక మండపాల ప్రతి ఒక్క మండపం నిర్వాహకులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. అందులో ఉన్న సూచనలు తప్పకుండా పాటించాలన్నారు. నిమజ్జనం చేసే రూట్ మ్యాప్ ను ముందుగానే తయారు చేసుకొని అధికారులకు అందజేయాలన్నారు.
నిమజ్జన రూట్ లో విద్యుత్ వైర్లు, చెట్ల కొమ్మలు లేకుండా విద్యుత్, మున్సిపల్ అధికారులు చూసుకోవాలన్నారు. పండుగల వేల సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులను, కించ పరిచేలా, మనోభావాలను దెబ్బతీసేలా ఉండే పోస్టులు పెట్టరాదన్నారు. ఎక్కడి నుంచో వచ్చిన పోస్టులను షేర్ చేయడం చేయకూడదన్నారు. అలాంటి పోస్టులు వస్తే వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలన్నారు. ముఖ్యంగా పీస్ కమిటీ సమావేశానికి వచ్చిన వారితోపాటు ప్రజలంతా పండుగ, నిమజ్జనం శాంతి యుతంగా జరుపుకునేందుకు కృషి చేయాలన్నారు. నిమజ్జనం కూడా త్వరగా పూర్తయ్యేలా చూడాలన్నారు. ఎక్కువ రాత్రి అయ్యే వరకు కాకుండా త్వరగా పూర్తి చేయాలన్నారు. నిజమ్జనం చేసే ప్రాజక్టు, చెరువుల వద్దకు చిన్న పిల్లలను తీసుకువెళ్లవద్దన్నారు. ఈ కార్యక్రమంలో పరిగి తహసీల్దార్ ఆనంద్ రావు, పరిగి మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ కుమార్, డీఎస్పీ కరుణా సాగర్ రెడ్డి, సీఐ శ్రీనివాస్, డిస్కం ఏఈ ఖాజా బాబు, ఎస్ఐ సంతోష్, వివిధ పార్టీల నాయకులు, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మత పెద్దలు పాల్గొన్నారు.