దిశ ఎఫెక్ట్.. స్పందించిన సీఈఓ..
ఆమనగల్ నుండి షాద్నగర్ వెళ్లే ప్రధాన రహదారికి సమీపంలోని తలకొండపల్లి మండలానికి చెందిన సంగాయిపల్లి గేటు వద్ద ఆమనగల్ లయన్స్ క్లబ్, చుక్కాపూర్ గ్రామానికి చెందిన జక్కు నారాయణరెడ్డి అనే దాతల సహకారంతో 2004లో ప్రయాణికుల సౌకర్యార్థం బస్సు షెల్టర్ నిర్మించారు.
దిశ, తలకొండపల్లి : ఆమనగల్ నుండి షాద్నగర్ వెళ్లే ప్రధాన రహదారికి సమీపంలోని తలకొండపల్లి మండలానికి చెందిన సంగాయిపల్లి గేటు వద్ద ఆమనగల్ లయన్స్ క్లబ్, చుక్కాపూర్ గ్రామానికి చెందిన జక్కు నారాయణరెడ్డి అనే దాతల సహకారంతో 2004లో ప్రయాణికుల సౌకర్యార్థం బస్సు షెల్టర్ నిర్మించారు. కాగా ఈ బస్సు షెల్టర్ మొత్తం పిచ్చి మొక్కలతో నిండుకపోయి నిరుపయోగంగా మిగిలిపోయింది. అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల బస్ బస్ షెల్టర్ నిరుపయోపంగా ఏర్పడిందని, దిశ దినపత్రిక గురువారం ప్రచురించింది.
దిశ దినపత్రికలో వార్తా కథనం వెలువడిన వెంటనే రంగారెడ్డి జిల్లా సీఈవో సీహెచ్ కృష్ణారెడ్డి, స్థానిక ఎంపీడీవో శ్రీకాంత్ వెంటనే క్లీన్ చేయిస్తామని దిశకు వివరణ ఇచ్చారు. పడమటి తండాకు చెందిన గ్రామపంచాయతీ కార్మికులతో స్థానిక ఎంపీఓ రఘు గురువారం ఉదయం సంగాయిపల్లి గిరిజన తండా గేటు వద్దకు చేరుకొని వెంటనే పిచ్చి మొక్కలతో నిండుక పోయి అపరిశుభ్రంగా ఉన్న బస్ షెల్టర్ పరిసర ప్రాంతాల మొత్తం శుభ్రం చేయించారు. బస్సు షెల్టర్ ప్రాంతం మొత్తం క్లీన్ చేయడంతో స్థానిక గిరిజన రైతులు, మహిళలు, ప్రయాణికులు దిశకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.