ప్రజా ప్రతినిధుల పేరుతో అధికారి వసూళ్లు?
అనుమతులు లేని అక్రమ నిర్మాణాలపై దోచుకునేందుకు అధికారులు కొత్త పుంతలకు తెరలేపుతున్నారు.
దిశ, అబ్దుల్లాపూర్మెట్: అనుమతులు లేని అక్రమ నిర్మాణాలపై దోచుకునేందుకు అధికారులు కొత్త పుంతలకు తెరలేపుతున్నారు. అక్రమ నిర్మాణాలను నిలిపివేసే క్రమంలో అధికారులుగా తామే అడ్డుకుంటే ప్రజల నుంచి చిత్కారాలు, మాటలు ఎదురవుతున్న దృష్ట్యా వాటి నుంచి తప్పించుకునేందుకు పెద్ద అంబర్ పేట మున్సిపాలిటీ అధికారులు ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నా యి. అధికారులు చేస్తున్న కార్యక్రమాల కు స్థానిక ప్రజల నుంచి బహిరంగ విమర్శలు వస్తున్నాయి. అక్రమ నిర్మాణాలకు నిలిపివేసేందుకు తమ కార్యాలయ పరిధిలోని సిబ్బందిని పురమాయించి ముందు పని నిలిపివేయడం ఆ తర్వాత సదరు అనుమతులు నిర్మాణాలు నిలపడం అనంతరం యజమానుల దారులను ఆఫీసుకు పిలిపించి అక్రమ నిర్మాణాలకు సంబంధించి బేరసారాలు చేయడం కుదరకపోతే వార్నింగ్ ఇవ్వడం పెద్ద అంబర్‌పేట మున్సిపాలిటీలో జరుగుతున్న నిత్య ప్రచారం.
ఇటీవల కాలంలో పెద్ద అంబర్ పేట లో చేపట్టిన ఓ అక్రమ నిర్మాణాన్ని ఆపేందుకు ముందుగా మున్సిపల్ అధికారులు తమ సిబ్బందిని పురమాయించినట్లు సమాచారం. నిర్మాణం దగ్గరికి వెళ్లిన సిబ్బంది తమ పై అధికారి పనులు నిలిపివేయాలని, అనుమతులు తీసుకోవాలని చెప్పి ఆఫీసుకు పిలిపించారు. అనంతరం సొంతంగానే బేరాలు చేస్తే తమకు ఎక్కడ అవమానం జరుగుతుందోనని గ్రహించిన సదరు అధికారి స్థానిక కౌన్సిలర్ మీ పనులు నిలిపివేయాలంటూ తమపై ఒత్తిడి తీసుకు వస్తున్నారని చెప్పడం, అదే విధంగా కొంతమంది పత్రికా రిపోర్టర్ల పేరు కూడా చెప్పి వసూళ్లకు పాల్పడడం జరిగినట్లు విశ్వసనీయ సమాచారం. వివిధ సమాచారాలు సేకరించేందుకు మున్సిపల్ కార్యాలయానికి వచ్చే పత్రిక రిపోర్టర్లను అడ్డుపెట్టుకుని కూడా సదరు అధికారి లక్షల్లో వసూలు చేసినట్లు బహిరంగ ఆరోపణలు వస్తున్నాయి.
అయినప్పటికీ అక్రమ నిర్మాణదారులు వినిపించుకోకపో తే కొన్ని పత్రికలకు తన సూచనగా చెబుతూ వార్తలు సైతం రాయించి వసూళ్లకు పాల్పడినట్లు తెలుస్తోంది. అదేవిధంగా కలవంచలోని ఓ వార్డులో స్థానికంగా ఉన్న రాజకీయ నేతను అడ్డుపెట్టుకుని లక్షల్లో వసూలు చేసినట్లు తెలిసింది. పెద్ద అంబర్పేటలోని మరో వార్డులో సైతం జాతీయ రహదారిపై వెంట జరిగే అక్రమ నిర్మాణాలు నిలుపు వేసేందుకు స్థానిక ప్రజాప్రతినిధి పనులు వేయాలంటూ సదరు నిర్మాణదారులను భయభ్రాంతులకు గురిచేసి రూ.5 లక్షల వరకు తీసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అదే విధంగా ఇంటి నిర్మాణాలకు అనుమతులు ఇస్తూ తిరిగి అనుమతులు నిలిపివేయాలని నోటీసులు ఇస్తూ సరైన వాటికీ సైతం డబ్బులు వసూలు చేసేందుకు కొత్త ప్రక్రియ మొదలుపెట్టినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
మూడో వార్డులో ఓ వెంచర్ యజమాని తన పనులు చేసుకునేందుకు అనుమతుల కు దరఖాస్తు చేసుకుంటే చివరికి నియోజకవర్గ ప్రజా ప్రతినిధి పేరును అడ్డుపెట్టి డబ్బులను డిమాండ్ చేసిన ట్లు సదరు వెంచర్ దారులు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా పెద్ద అంబర్ పేటకు చెందిన సదరు అధికారి చేస్తున్న అవినీతి అక్రమాలపై ఇప్పటికే పలువు రు ప్రజా ప్రతినిధులు బహిరంగంగా దూషిస్తున్న పట్టించుకొని సదరు అధికారి ఏ విధంగా అనవుగా ఉంటే ఆ విధంగా తన వ్యవహార శైలిని చూపిస్తూ డబ్బులు వసూలు చేసే పనిలో నిమగ్నమైనట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. పైగా తానేమి మీ అక్రమ నిర్మాణాలకు అడ్డుగా ఉండను అని చెప్పుకుంటూ సానుభూతి ప్రకటించుకుంటూ ఇతరులపై దుమ్మెత్తి పోసే కార్యక్రమం చేపట్టిన అధికారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పెద్ద అంబర్‌పేట మున్సిపాలిటీ ప్రజలు ఉన్నతాధికారులను కోరుతున్నారు.