నూతన కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన నారాయణరెడ్డి
వికారాబాద్ జిల్లా నూతన కలెక్టర్ గా 2015 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి నారాయణ...Narayana Reddy took charge as the new collector
దిశ ప్రతినిధి, వికారాబాద్: వికారాబాద్ జిల్లా నూతన కలెక్టర్ గా 2015 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి నారాయణ రెడ్డి గురువారం కలెక్టర్ కార్యాలయంలోని తన ఛాంబర్ లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో ప్రజలకు అందే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలియజేశారు. రాబోవు ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా రెవెన్యూ అధికారి అశోక్ కుమార్ ఉన్నారు.