Runa Mafi : రుణమాఫీలో 1519 మంది రైతుల పేర్లు గల్లంతు

రుణమాఫీ కానీ రైతుల్లో అయోమయం నెలకొంది.

Update: 2024-07-22 09:04 GMT

దిశ,యాచారం: రుణమాఫీ కానీ రైతుల్లో అయోమయం నెలకొంది. తమకు ఎందుకు కాలేదని బ్యాంకు, వ్యవసాయ అధికారులను రైతులు నిలదీస్తుంటే సమాధానం చెప్పలేక తలలు పట్టుకుంటున్నారు. రూ.లక్ష లోపు రుణం తీసుకున్న 1854 మందికి ప్రభుత్వం రూ 10.44 కోట్ల రుణ మాఫీ చేసింది. మండలంలో ఇంకా 2000 వేలకు పైగానే లక్ష లోపు రుణం తీసుకున్న రైతులకు మాఫీ కాలేదని తెలుస్తున్నది. పీఎసీఎస్ బ్యాంకులో 427 మందికి మాత్రమే రుణ మాఫీ కాగా 1519 మంది రైతుల రుణమాఫీ జాబితాలో పేర్లు గల్లంతు కావడంతో రైతులు అయోమయ స్థితిలో ఉన్నారు. తెలంగాణ గ్రామీణ బ్యాంకులో 125 మందికి మాత్రమే రుణమాఫీ కాగా చాలామందికి రాలేదని రైతులు ఆందోళనలో ఉన్నారు. మేడిపల్లి గ్రామం లో ఇండియన్ బ్యాంకులో 370 మంది రుణాలు తీసుకోగ ఒక్కరు పేరు కూడా ఈ జాబితాలో పేరు లేకపోవడంతో రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. బ్యాంకుల చుట్టూ వ్యవసాయ అధికారుల చుట్టూ తిరుగుతూ తమ గోడును వెల్లబోసుకుంటున్నారు. ఇప్పటికైనా లక్ష రూపాయల రుణాన్ని మాఫీ చేయాలని కోరుతున్నారు.

Tags:    

Similar News