మురళిగౌడ్ కు అంత సీన్ ఉందా..?

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మురళి గౌడ్ భవిష్యత్ నేతగా ముద్రవేసుకునే ప్రయత్నం చేస్తున్నా.. ఆయనకు అంత సీన్ లేదంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.

Update: 2023-03-08 10:35 GMT

దిశ, తాండూరు రూరల్ : రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మురళి గౌడ్ భవిష్యత్ నేతగా ముద్రవేసుకునే ప్రయత్నం చేస్తున్నా.. ఆయనకు అంత సీన్ లేదంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని ఓటమికోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. బీజేపీ పార్టీలో మురళి గౌడ్ కంటే ఎంతోమంది బెటర్ నాయకులు ఉన్నా.. అవకాశం కలిసి రావడంరాలేదు. కేవలం 2018 ఎన్నికలలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి ముఖ్యనేతగా ఉంటూ.. సలహాలు, సూచనలు ఇచ్చినందుకే తనే ఎమ్మెల్యేను గెలిపించిన అనే భ్రమలోను ఉండాడనే వాదనలు వినిపిస్తున్నాయి.

రాజకీయల్లో భవిష్యత్ నేతగా గుర్తింపు కోసం ఆరాట పడుతున్నాడు..? ఆయనకు అంత సీన్ ఉందా అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పైలెట్ రోహిత్ రెడ్డి తన లక్ష్యమని తన సన్నిహితుల దగ్గర చెప్పుకుంటున్నాడు. ఒకవేళ ఓడితే ఎలాగో క్రెడిట్ మొత్తం తన ఖాతాలోనే మురళి కృష్ణ గౌడ్ వేసుకుంటారు కాబట్టి... తాము కష్టపడ్డా ప్రయోజనం శూన్యం అన్నట్టుగా బీజేపీ నేతలలో ఈ ఆలోచన ఉందా..? దాంతో మురళీకృష్ణ గౌడ్ రాజకీయల భవిష్యత్ కోసం చేసే ప్రయత్నాలు పాలిస్తావా..? లేవా..? అన్నది తెలియాలంటే వేచి చూడాలి మరి.

బీజేపీలో ఈయన మాట వినేది ఎవరు..?

ఈ ప్రాంత రాజకీయాల్లో తనదైన గుర్తింపు కోసం ఆరాటం చేస్తున్నారని వాదనలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని ఓడించడమే తన ప్రాధన లక్ష్యమని బిల్డప్ ఇవ్వడం ఏమిటి అని పలువురు విమర్శల జల్లు కురిపిస్తున్నారు. ఈయనకు తాండూరు నియోజకవర్గంలో అంత పలుకుబడి లేదని రాజకీయల్లో ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీరి కంటే ముందు పార్టీ కోసం పని చేసిన వారు ఉన్నారు. వారిని కాదని ఏ నిర్ణయం తీసుకోలేడుకూడా..! ఒక పార్టీ నేతగా సలహాలు, సూచనలు ఇవ్వడం వరకే ఓకే కానీ..పార్టీలో తనే భవిష్యత్ నేతగా గుర్తింపునకు అంత సీన్ ఉండదనే వాదనలు వినిపిస్తున్నాయి.

అక్రమాల నేతనా..?

మురళి కృష్ణ గౌడ్ గత మూడేళ్లు అధికార పార్టీలోనే ఉన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డూ అదుపూ లేకుండా ఆయన అవినీతి, అక్రమ దందాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. భూకబ్జాలు ఇసుక, శుద్ధ గనులలో భారీ అక్రమలకు పాల్పడ్డారని సోషల్ మీడియాలో వైరల్ చేసిన విషయం తెలిసిందే. భూకబ్జాదారులకు వత్తాసు పలుకుతూ నియోజకవర్గంలో ప్రభుత్వ స్థలాలను సైతం అక్రమించుకుంటున్నారని ఆరోపించారు. 3 ఏళ్లలో ఆయన అక్రమ సంపాదన ఎంతో ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. బీఆర్ఎస్ నేతలు సవాలు చేస్తున్నారు.

Tags:    

Similar News