శంషాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధిలో ఎంపీ, ఎమ్మెల్యేలది కీలకపాత్ర..
శంషాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధిలో ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలది కీలకపాత్ర అని శంషాబాద్ మున్సిపల్ 17వ కౌన్సిలర్ మేకల వెంకటేష్ అన్నారు.
దిశ, శంషాబాద్ : శంషాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధిలో ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలది కీలకపాత్ర అని శంషాబాద్ మున్సిపల్ 17వ కౌన్సిలర్ మేకల వెంకటేష్ అన్నారు. శంషాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధికి 70 కోట్లు మంజూరు చేయించినందుకు బుధవారం ఎంపీ రంజిత్ రెడ్డిని హైదరాబాద్ లోని నివాసంలో, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ను మైలార్దేవుపల్లిలోని నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మున్సిపాలిటీ పూర్తిగా 111 జీవో పరిధిలో ఉన్నందున నిధులు లేక ఇబ్బందులు పడుతున్న సమయంలో ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఇద్దరు కలిసి మున్సిపాలిటీ అభివృద్ధి కొరకు ఎంతో కృషి చేశారని అన్నారు.
నూతన ప్రభుత్వ ఆసుపత్రి నిర్మించడంతో పాటు, సిద్ధాంతి నుండి సింప్లెక్స్ వరకు మరో బ్రిడ్జి నిర్మించడానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడమే కాకుండా నేషనల్ అధికారులకు లేఖ రాయడం కూడా ఎంతో సంతోషం అన్నారు. అంతేకాకుండా మున్సిపాలిటీ అభివృద్ధి కొరకు 70కోట్ల నిధులు మంజూరు చేసి మున్సిపాలిటీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సేవలు శంషాబాద్ మున్సిపల్ ప్రజలు ఎప్పుడు మర్చిపోవదన్నారు. శంషాబాద్ బ్రిడ్జి పొడిగింపు కొరకు కృషి చేసిన మున్సిపల్ చైర్ పర్సన్ సుష్మారెడ్డితో పాటు జేఏసీ నాయకులకు, కౌన్సిలర్లకు అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలిపారు.