MLA: మోకిలా లా పలోమా బాధితులకు శాశ్వత పరిష్కారం చూపాలి

హైదరాబాద్ కి పరిమితం చేసిన ఎస్ ఎన్ డి పి నాలాల అభివృద్ధి కార్యక్రమాన్ని గ్రామీణ ప్రాంతాలైన శంకర్పల్లి మున్సిపాలిటీ వరకు పొడిగిస్తే శాశ్వత పరిష్కారం చూపవచ్చని విద్యాశాఖ మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.

Update: 2024-09-07 13:21 GMT

దిశ, శంకర్పల్లి : హైదరాబాద్ కి పరిమితం చేసిన ఎస్ ఎన్ డి పి నాలాల అభివృద్ధి కార్యక్రమాన్ని గ్రామీణ ప్రాంతాలైన శంకర్పల్లి మున్సిపాలిటీ వరకు పొడిగిస్తే శాశ్వత పరిష్కారం చూపవచ్చని విద్యాశాఖ మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. శంకర్పల్లి మండలం మోకిలా గ్రామ పరిధిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు లా పొలామా విల్లాస్ లోకి వరదలు ముంచెత్తి నానా హంగామా సృష్టించిన ప్రాంతాన్ని శనివారం మాజీ మంత్రి సందర్శించారు. విల్లాల యజమానులతో సమావేశమై జరిగిన సంఘటనపై ఆరాతీశారు. వారికి అండగా ఉంటామని ఆమె అభయం ఇచ్చారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… బీఆర్ఎస్ అధినేత చంద్రశేఖర రావు ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన ఎస్ ఎన్ డి పి పనులతో భారీ వర్షాలు వచ్చిన హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో ఆ ప్రాజెక్టు వల్ల సురక్షితం అయిందన్నారు. ఎక్కడ వరదలు రాలేదు ప్రజలు ఇబ్బంది పడలేదన్నారు. మూడు దశల్లో చేపట్టాల్సిన ఈ నాళాల అభివృద్ధి కార్యక్రమం కేవలం మొదటి దశతోనే సత్ఫలితాలు ఇవ్వగా రెండవ మూడవ దశలో శివారులోని మున్సిపాలిటీల వరకు విస్తరించాలని అందులో భాగంగా శంకర్పల్లి మున్సిపాలిటీ వరకు ఈ కార్యక్రమం చేపట్టాల్సి ఉందని అన్నారు.

కానీ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ కి ఎస్ ఎన్ డి పి నాలాల కార్యక్రమం పరిమితం చేయాలని చూస్తుందని దీన్ని శంకర్ పల్లి మున్సిపాలిటీ వరకు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగిందని అన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మోకిలా మాజీ సర్పంచ్లు అడివయ్య, నర్సింలు శంకర్పల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు సభావాత్ రాజు నాయక్, మాణిక్ రెడ్డి, శంకరపల్లి మాజీ జెడ్పిటిసి కే నారాయణ, మహారాజుపేట మాజీ సర్పంచ్ దోసాడ నరసింహారెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గోవర్ధన్ రెడ్డి, మోకిలా అధ్యక్షుడు లింగం ముదిరాజ్, మైనార్టీ నాయకుడు నయీం భాష, విల్లాస్ యజమానులు పాల్గొన్నారు.


Similar News