ముప్పై ఏళ్ళు ఒక లెక్క, మూడేళ్ళు ఒక లెక్క
30 ఏళ్ళు ఒక లెక్క, 3 ఏళ్ళు ఒక లెక్క అంటున్నారు తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి.
దిశ, తాండూరు : 30 ఏళ్ళు ఒక లెక్క, 3 ఏళ్ళు ఒక లెక్క అంటున్నారు తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి.ఎన్నో ఏళ్ల తరబడి మాసిపోయిన తాండూరు ప్రాంతానికి కొత్త రూపం తీసుకువచ్చేందుకు నిరంతరం పోరాటం చేస్తున్నారు. తాండూరు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నాడు పైలట్. కాలుష్య రహిత తాండూరు గా మర్చి చూపిస్తానని ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాడు.
తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గెలిచిన 3 ఏళ్లలో 2 ఏళ్ళు ఎలక్షన్, కరోనా తో అభివృద్ధి పనులు చేయలేక పోయామని పలు మార్లు ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే. అయితే తాండూరు ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ఎల్లవేళలా కృషి చేస్తూనే ఉన్నారు. ఎన్నో ఏళ్ల నుండి తాండూరు పట్టణ ప్రజలు గుంతల రోడ్లలో పడి గాయలపాలైన, మృతి చెందిన సంఘటనలు ఎన్నో జరిగాయి.
రోడ్లపై ఎర్పడిన గుంతలతో దుమ్ము దూళి లాంటివి తాండూరు ప్రజలను అనారోగ్యం పాలు చేసాయి. ఇతర ప్రాంత ప్రజలు తాండూరుకు రావాలంటేనే భయబ్రాంతులకు గురయ్యేవారు. మాకు మంచి రోడ్లను ఇవ్వండి అంటూ తాండూరు ప్రజలు ఏకమై తమ ప్రాంతం కోసం, ప్రజల రక్షణ కోసం, రోడ్ల కోసం రోడెక్కి నిరసనలు, ధర్నా లు చేశారు. నియోజకవర్గం ప్రజల కష్టాలు చూడలేక అసెంబ్లీలో తాండూరుకు రావాల్సిన నిధుల కోసం గళం విప్పారు. ఏకంగా ఒకే రోజు 5 జీవోలు అమలు చేసిన ఘనత దక్కించుకున్నారు.
ఎన్నో ఏళ్ల తరబడి పెండింగ్ లో పడిన పనులకు శంకుస్థాపనలు చేశారు. తాండూరు పట్టణంలో నేషనల్ హైవే, ఔటర్ రింగ్ రోడ్డు, పనులు వేగవతంగా జరుగుతున్నాయి. పట్టణంలో ప్రధాన సమస్య డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం, దింతో ప్రధాన రహదారుల వెంట డ్రైనేజీ పనులు కూడా ప్రారంభం అయ్యాయి. డ్రైనేజీ కోసం అడ్డంగా ఉన్న భవనాలు, దుకాణాలు కూడా కూల్చి పనులను జరిపిస్తున్నారు. తాండూరు అభివృద్ధి కోసం ప్రజలు కూడా మీతో మేము అంటూ సహకరిస్తున్నారు.
ఇలా ఎన్నో విధాలుగా తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఇచ్చిన మాట తప్పకుండ తాండూరు రూపురేఖలు మారుస్తున్నారని చెప్పవచ్చు. ప్రజలలో ఉంటూ, ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ, డైనమిక్ ఎమ్మెల్యేగా పైలట్ పేరు గాంచారు. తాండూరు ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.