ఆర్యవైశ్యులకు సముచిత స్థానం కల్పించిన వ్యక్తి సీఎం కేసీఆర్.. మంత్రి సబిత
తెలంగాణ రాష్ట్రంలో ఆర్యవైశ్యులకు సముచిత స్థానం కల్పించిన వ్యక్తి సీఎం కేసీఆర్ అని విద్యా శాఖ మంత్రి, మహేశ్వరం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సబిత ఇంద్రారెడ్డి అన్నారు.
దిశ, మీర్ పేట్ : తెలంగాణ రాష్ట్రంలో ఆర్యవైశ్యులకు సముచిత స్థానం కల్పించిన వ్యక్తి సీఎం కేసీఆర్ అని విద్యా శాఖ మంత్రి, మహేశ్వరం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సబిత ఇంద్రారెడ్డి అన్నారు. కార్పొరేషన్ పరిధిలోని వంగ శంకరమ్మ గార్డెన్లో బాలాపూర్ ఆర్య వైశ్య మహాసభ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి జరిగిన ఆత్మీయ సమ్మేళన౦ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా మహేశ్వరం నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరైయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గంలో ఆయా చోట్లలో ఆర్యవైశ్యుల ఆత్మగౌరవ భవనాలకు పెద్ద ఎత్తున స్థలాలు, నిధులు ఇచ్చినట్లు తెలిపారు. జల్పల్లిలో 500 గజాలు 10 లక్షలు, కందుకూరులో 100 గజాలు 5 లక్షలు, మహేశ్వరంలో 400 గజాలు పది లక్షల రూపాయలు, బడంగ్పేట్ లో 300 గజాలు 10 లక్షల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. ఓసీల్లోని పేదల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో మానవీయ కోణంలో ఆలోచించి అనేక పథకాలు ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. ఇప్పటికే అమలవుతున్న కళ్యాణాలక్ష్మి, షాది ముబారక్ లాంటి పథకాలు సమాజంలో అనేక మార్పులకు కారణం అయ్యాయన్నారు. దేశంలోనే మొదటిసారి రైతు బంధు, రైతు భీమా పథకాలు ప్రవేశపెట్టి వ్యవసాయాన్ని పండుగగా మార్చారన్నారు. ఇవేవీ ఎన్నికల వాగ్దానాలు కావాని అందరి సంక్షేమం కోసం తీసుకున్న చర్యలు అన్నారు. మరల అధికారంలోకి వస్తే రైతు బంధు 16 వేల వరకు పెంచుతామని ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్నారని మంత్రి గుర్తు చేశారు. ఇన్నాళ్లు పాలించిన పార్టీలు ఇవేమీ చేయకున్న నేడు మంచి చేస్తున్న ప్రభుత్వం పై విమర్శలు చేయటం సబబు కాదన్నారు.
రైతు భీమా స్పూర్తితో బతుకుకు ఆర్థిక భరోసా కలిపిస్తూ 93 లక్షల మందికి 5 లక్షల భీమా సౌకర్యం, పేదమహిళలకు 3 వేలు ఆర్ధిక సహాయం, 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ లాంటి అనేక పథకాలకు హామీ ఇస్తమన్నారు. లావణి భూములకు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం పట్టాదారు హక్కు పత్రం ఇస్తుందన్నారు. నవంబర్ 30 న జరిగే ఎన్నికల్లో కారు గుర్తు పై ఓటు వేసి ఎమ్మెల్యే గా తనను, సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బుగ్గారపు దయానంద్ గుప్తా, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ గుప్తా, టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, రంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య ఎన్నికల కమిటీ అధ్యక్షుడు చింతల రవికుమార్, ఆర్యవైశ్య తెలంగాణ మహాసభ అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ, మేయర్ యం.దుర్గా దీప్లాల్ చౌహన్, డిప్యూటీ మే తీగల విక్రం రెడ్డి, కార్పొరేటర్ నవీన్ గౌడ్, కన్యకా పరమేశ్వరి దేవస్థాన కమిటీ చైర్మన్ తెరటిపల్లి శ్రీనివాస్ గుప్తా, బాలాపూర్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు నార్ల శ్రీనివాస్ గుప్తా, మీర్ పేట్ ఆర్యవైశ్య అధ్యక్షుడు విట్ట శ్రీనివాస్, బడంగ్ పేట ఆర్యవైశ్య అధ్యక్షుడు శ్రీనివాస్ గుప్తా, ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.