Manchu Manoj : ప్రేమించిన అమ్మాయిని పెళ్ళాడడానికి పోరాడా.. మంచు మనోజ్..

రాచకొండ పోలీస్​ కమిషనరేట్​కు విచారణకు హాజరుకావడానికి వెళ్తున్న మంచు మనోజ్ బుధవారం ఉదయం​ మీడియాతో సంచలన విషయాలు బయటపెట్టారు.

Update: 2024-12-11 07:56 GMT

దిశ, బడంగ్ పేట్ :​ రాచకొండ పోలీస్​ కమిషనరేట్​కు విచారణకు హాజరుకావడానికి వెళ్తున్న మంచు మనోజ్ బుధవారం ఉదయం​ మీడియాతో సంచలన విషయాలు బయటపెట్టారు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కోసం పోరాడానని, దాంట్లో తప్పేముందని మంచు మనోజ్​ అన్నారు. ఈ రోజు వచ్చి 10 మంది నిలబడినప్పుడు నేను చెడ్డోడిని అయ్యానన్నారు. ఎక్కడ సైన్​ పెట్టమంటే పెట్టడానికి రమ్మంటే వచ్చాను.. పొమ్మంటే పోయానన్నారు. ఎన్ని సినిమాలు చేయమంటే అన్ని సినిమాలు చేశానన్నారు. అన్న కంపెనీలలో పని చేశాను.. సాంగ్​లు చేశాను.. రికార్డింగ్​లు కూడా చేశానన్నారు. ఫైటర్​ గా, డైరెక్షన్​లు సైతం చేశాను.. ఎంతో గొడ్డులా కష్టపడ్డాను.. మనసు పూర్వంగా సంతోషంగా చేశానన్నారు. నేను ఒక్క రూపాయి అడిగింది లేదు.. ఆశించింది లేదని మనోజ్​ కంటతడి పెట్టారు.

నేను పనిచేసిన దాని కోసం డబ్బు కూడా నేను అడగట్లేదు. ఈ రోజు నా భార్య పిల్లల కోసం నేను నిలబడక పోతే రేపు నా కొడుకు పెద్దోడయ్యాక కూతరు పెద్దగయ్యాక వాళ్లకు నేను సమాధానం చెప్పుకోవాలి. నేను దొంగతనం చేసి వేరే వాళ్ల కడుపులు కొట్టి పిల్లల మొహం నేను చూడలేను. ఆ కూడు నా పిల్లలకు పెట్టలేను. మా నాన్న, అమ్మ నన్ను అలా పెంచలేదు. మధ్యలో మా అమ్మ నలిగిపోతుంది. మా అమ్మ ఆసుపత్రిలో అడ్మిట్​ అయ్యారని చెప్పి అబద్దాలు ఆడారు. నువ్వు వెళ్లిపో ఇంటి నుంచి మంచిగా మాట్లాడి పంపిస్తామంటేనే అమ్మ ఇంట్లో నుంచి దడదడగానే వెళ్లింది. అక్కడి నుంచి మా అమ్మ అన్న ఇంటికి వెళ్ళి అక్కడే పడుకున్నారు. నా భార్య వచ్చిన నుంచే నేను చెడ్డోడినని చెప్పడం బాధేసింది. ఇపుడు అదే వాళ్ల తల్లిదండ్రులు ఉంటే గమ్నున ఉండేవాళ్ళా ? అని ప్రశ్నించారు. ఈ రోజు నేను గమ్మున ఉంటే ఎలా ? ఆమెకు భర్త అయినా, తల్లి అయినా, తండ్రి అయినా అన్నీ నేనే అన్నారు. తను వాళ్ళ ఇంట్లో ఆధారపడదు.. తను వాళ్ల ఇంట్లో ఆధారపడదని చెప్పారు. నేను నా సినిమాలు చేసుకుంటున్నాని, తాను సొంతంగా టాయ్​ కంపెనీ పెట్టుకుందన్నారు.

లాక్​ డౌన్​లో నా అహం బ్రహ్మాస్మి సినిమా ప్రేమ కోసం ఆపేసినపుడు నిర్దాక్షిణ్యంగా ఇంట్లో వద్దని తాను చెన్నైకు షిఫ్ట్ అయ్యాను. మనోజ్ నువ్వు బొమ్మలు గీస్తావు కదా.. కథలు రాస్తావు కదా బొమ్మలకి ఆత్మనిర్బర్​ అని నరేంద్రమోడీ ప్రకటించారు. నీకు బొమ్మలు ఇష్టం.. మనమే క్రియేట్​ చేద్దాం అని లాక్​ డౌన్​లో నేను డ్రాయింగ్​లు వేసి కథలు కూడా రాశాను. నా స్నేహితుల వద్ద కొంచెం అప్పులు కూడా చేశాను. మేమే పెట్టుబడులు పెట్టుకుంటూ తాను, తనభార్య నిలదొక్కుకున్నామన్నారు. కాశ్మీర్​ నుంచి కన్యాకుమారి వరకు తను, నేను మరి కొంత మంది కలిసి దీన్ని ఇంత దూరం తీసుకువచ్చామన్నారు. ఈ రోజు మళ్ళీ సినిమాలకు వచ్చేశానన్నారు. మా నాన్న మీద గన్ను పెట్టి కాల్చే వినయ్​కి మా అన్నకి సాయంత్రం ప్రతిదీ చెబుతానన్నారు. వినయ్​, మా అన్నవిష్ణు కారణంగానే మా నాన్న నాన్న లా లేరు.. పూర్తిగా మారారని మనోజ్​ ఆరోపించారు. చోరీకి గురైన సీసీ కెమెరా విజువల్స్​ తెప్పిస్తే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయన్నారు.

Tags:    

Similar News