Speaker : గ్రంథాలయాలను మరింత పటిష్టం చేయాలి

జిల్లా గ్రంథాలయం పేరు ప్రతిష్టలకు నిలయమని, ఆ పేరును కంటిన్యూ చేస్తూ ముందుకు వెళ్లాలని తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు.

Update: 2024-10-17 13:46 GMT

దిశ, ప్రతినిధి వికారాబాద్ : జిల్లా గ్రంథాలయం పేరు ప్రతిష్టలకు నిలయమని, ఆ పేరును కంటిన్యూ చేస్తూ ముందుకు వెళ్లాలని తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. గురువారం అంబేద్కర్ భవనములో నిర్వహించిన నూతన జిల్లా గ్రంథాలయ చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తో పాటు రాష్ట్ర చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ… వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన యస్.రాజేష్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు ఆయనను గ్రంథాలయ చైర్మన్ గా నియమించడం జరిగిందన్నారు.

గతంలో చాలా గొప్ప వారు గ్రంథాలయ చైర్మన్ లుగా పనిచేశారు. విద్యాకు నిలయం వికారాబాద్ జిల్లా పెట్టింది పేరని, జిల్లా గ్రంథాలయ పేరు ప్రతిష్టలను కంటిన్యూ చేస్తూ ముందుకు వెళ్లాలన్నారు. నిరుద్యోగులకు ఎలాంటి నిరాశ కలగకుండా కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్న వారికి ఉపయోగపడే విధంగా అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉంచాలన్నారు. గ్రంథాలయ భవన నిర్మాణం కోసం భూమి ఎంత కావాలో ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని, గ్రంథాలయ సేవలు అన్ని గ్రామాలకు తీసుకువెళ్లే విధంగా పని చేయాల్సిందిగా కోరారు. తెలంగాణా రాష్ట్ర శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ…వెనుకబడిన ప్రాంతంగా ఉన్న ఈ జిల్లాలోని ప్రతి గ్రామంలో ప్రతి పేదవారికి గ్రంథాలయ సేవలు అందుబాటులో ఉండే విధంగా చూడాలన్నారు.

తను లైబ్రరిలో చదివానని గత స్మృతులు గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా నూతన చైర్మన్ కు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ తాను కూడా లైబ్రరీలో చదివానని, ప్రశాంత వాతావరణంలో అన్ని పుస్తకాలు చదివే వీలు ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పరిగి, తాండూరు శాసన సభ్యులు టి.రాంమోహన్ రెడ్డి, బి.మనోహర్ రెడ్డి, వైశ్య ఫెడరేషన్ చైర్మన్ కల్వ సుజాత, అదనపు కలెక్టర్ లింగ నాయక్, మున్సిపల్ చైర్ పర్సన్ చిగుల్లపల్లి మంజుల రమేశ్, ఆర్డిఓ వసుచంద్ర, నారాయణపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్ వార్ల విజయ కుమార్, మాజీ ఎంపీపీ ముద్దప్ప దేశ్ముఖ్, నందారం ప్రశాంత్, నర్సిములు గౌడ్, జయకృష్ణ, వెంకట్ రాములు గౌడ్, రాంచంద్రరెడ్డి, మెరుగు వెంకటయ్య, పెంటయ్య యాదవ్, వంశీ నాయక్, మల్లికార్జున్, సంతోష్ నాయక్, స్థానిక ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.


Similar News