తాండూరు లో మళ్లీ గులాబీ జెండా ఎగుర వేద్దాం : రోహిత్ రెడ్డి

రాష్ట్రంలో తాండూరులో బీఆర్‌ఎస్‌ పార్టీ ఎదురులేని శక్తిగా ఎదుగుతుందని, ముదిరాజ్‌ లు పార్టీ కి వెన్నెముక అని తాండూరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి రోహిత్ రెడ్డి అన్నారు.

Update: 2023-11-19 13:08 GMT

దిశ, తాండూరు : రాష్ట్రంలో తాండూరులో బీఆర్‌ఎస్‌ పార్టీ ఎదురులేని శక్తిగా ఎదుగుతుందని, ముదిరాజ్‌ లు పార్టీ కి వెన్నెముక అని తాండూరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి రోహిత్ రెడ్డి అన్నారు. ఆదివారం ఎంతో ప్రతిష్టాత్మకంగా తాండూరు పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన ముదిరాజ్‌ ల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రోహిత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రోహిత్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలోకి వచ్చిన తరువాత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ వచ్చిన తరువాతనే ముదిరాజ్‌ ల జీవితాల్లో వెలుగులు వచ్చాయన్నారు. ముదిరాజ్‌ కులస్తులకు చెరువుల లైసెన్స్‌, జీవిత బీమా సౌకర్యం కల్పించిన ఘనత బీఆర్‌ఎస్‌ సర్కారుకే దక్కుతుందన్నారు.

రాజధాని హైదరాబాద్‌లో ముదిరాజ్‌ ఆత్మగౌరవ భవన నిర్మాణా నికి 5 ఎరాల స్థలంతోపాటు ఐదు కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంజూరు చేశారని తెలిపారు. త్వరలో మరిన్ని చెరువులను తాండూరు నియోజకవర్గ వ్యాప్తంగా నూతనంగా ఏర్పాటు చేయనున్నామన్నారు. లోకల్ ఎవరు, నాన్ లోకల్ ఎవరో ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని అన్నారు. తాండూరు టిక్కెట్ బయటి వాళ్లకు అమ్ముకున్న వ్యక్తి రేవంత్ రెడ్డి కాదా అని సభాముఖంగా ప్రశ్నిస్తున్నానన్నారు. ముదిరాజులందరూ అభివృద్ధికి పట్టం కట్టి మీ బిడ్డ నైనా తనకు భారీ మెజారిటీ అందించి మళ్లీ తాండూర్ నియోజకవర్గానికి సేవ చేసుకునే గొప్ప అవకాశాన్ని కల్పించవలసిందిగా ఈ సభాముఖంగా కోరుతున్నానన్నారు.

నియోజకవర్గంలో 17 కొత్త చేపల చెరువులను ఏర్పాటు చేశానన్నారు. బీసీ ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ కోసం రెండెకరాల స్థలంలో రూ. 2 కోట్లతో నిర్మించనున్నట్లు చెప్పారు. అలాగే ఇప్పటికే 17 చేపల చెరువులను ముదిరాజ్ లకు అందజేశానని, రాబోయే రోజుల్లో మరో 40 చేపల చెరువులను ఏర్పాటు చేస్తానన్నారు. ముదిరాజ్ ల కోసం రూ. 1200 కోట్లు చేపల చెరువుల కోసం కేటాయించిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందన్నారు. కారు గుర్తుకు ఓటేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్, అరుణ్ కుమార్, ఆకుల రాములు, ఉమా శంకర్, లల్లు ముదిరాజ్, రమేష్, పరిమళ, అనురాధ, ఎస్పీ రవి, మొగులయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News