కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కస్టడీ పిటిషన్ 22 కు వాయిదా

ఈనెల 11న లగచర్లలో జరిగిన దాడి కేసులో అరెస్ట్ అయ్యి చర్లపల్లి జైల్లో ఉన్న పట్నం నరేందర్ రెడ్డిని కస్టడీకి ఇవ్వాలని కోరుతూ

Update: 2024-11-20 09:48 GMT

దిశ బొంరాస్ పేట్ : - ఈనెల 11న లగచర్లలో జరిగిన దాడి కేసులో అరెస్ట్ అయ్యి చర్లపల్లి జైల్లో ఉన్న పట్నం నరేందర్ రెడ్డిని కస్టడీకి ఇవ్వాలని కోరుతూ…పోలీసులు కొడంగల్ కోర్టులో పిటీషన్ వేయగా,కస్టడీ పిటిషన్ ను ఈనెల 22 కు వాయిదా వేశారు. అంతకుముందు భారీ పోలీసు బందోబస్తు మధ్యలో కొడంగల్ కోర్టుకు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి వచ్చారు. ఆయన తరపున వాదించేందుకు న్యాయవాదుల బృందం వచ్చింది. కొడంగల్ కోర్టులో వాదనలు పూర్తయిన తర్వాత చర్లపల్లి జైలుకు వెళ్లే ముందు, కోర్టు ఆవరణలో పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ…సీఎం పతనం కొడంగల్ నుంచి ప్రారంభిస్తానని,రైతులకు మద్దతు ఇస్తే అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయిస్తావా అన్నారు. పోలీసులు,ఇంటెలిజెన్స్ వైఫల్యం వల్ల దాడి జరిగింది. ఆ దాడిని డైవర్షన్ చేయడానికి నా పై అక్రమ కేసు పెట్టడం,కుట్రలో భాగమేనని అన్నారు. న్యాయస్థానంపై గౌరవం,నమ్మకం ఉంది. నిర్దోషిగా తిరిగి వస్తానని అన్న వీడియో వైరల్ అవుతుంది. నరేందర్ రెడ్డి వస్తున్నారని సమాచారం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కోర్టు వద్దకు చేరుకొని,నరేందర్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలని నినాదాలు చేశారు.


Similar News