కేసీఆర్ సంక్షేమ పథకాలే మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయిస్తాయి : మంచిరెడ్డి కిషన్ రెడ్డి

గడచిన తొమ్మిదేళ్లలో కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలే మరోసారి అధికారాన్ని రాబడతాయని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు

Update: 2023-11-25 15:07 GMT

దిశ, అబ్దుల్లాపూర్ మెట్ : గడచిన తొమ్మిదేళ్లలో కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలే మరోసారి అధికారాన్ని రాబడతాయని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. శనివారం పెద్ద అంబర్ పేట మున్సిపాలిటీ పరిధిలోని 14 వ వార్డు కౌన్సిలర్ తొండాపు రోహిణి బ్రహ్మానంద రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాలనీ సంక్షేమ సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడారు. మున్సిపాలిటీ తో పాటు ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని వివరించారు. కాలనీ లో ఉన్నటువంటి కొన్ని సమస్యలను త్వరలో పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. స్థానిక కౌన్సిలర్ రోహిణి రెడ్డి సైతం అభివృద్ధి ధ్యేయంగా తనకు నిత్యం కోరుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సీతారామ్ రెడ్డి, హరిందర్ రెడ్డి, లక్ష్మణ్ రావు, బుచ్చి రెడ్డి, భీమ్ రావు, మధుసూదన్ రెడ్డి, 14 వార్డ్ బీఆర్ఎస్ అధ్యక్షులు సందీప్, వెంకటేశ్వర కాలనీ, మత్తుగూడ కాలనీవాసులు పాల్గొన్నారు.

Tags:    

Similar News