రైతును రాజు చేయడమే కేసీఆర్ లక్ష్యం: ఎమ్మెల్యే కాలే యాదయ్య
రైతును రాజు చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యం అని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు.
దిశ, చేవెళ్ల: రైతును రాజు చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యం అని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా చేవెళ్ల మండల పరిధిలో ఆలూరు, కందాడ ఖానాపూర్, కమ్మెట, చేవెళ్ల క్లస్టర్లలో రైతు దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలను రాష్ట్రంలో అమలు చేస్తున్నారని అన్నారు. రైతులకు రైతుబంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత కరెంట్ అందిస్తూ రైతుల అండగా కేసీఆర్ ఉంటున్నారని చెప్పారు. సకాలంలో రైతులకు ఎరువులను, పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించిన నాయకులు కేసీఆర్. రైతులకు నకిలీ విత్తనాలు అమ్మే వారిపై బీఆర్ఎస్ ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతుందన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల పక్షపాతిగా వ్యవహరిస్తుందన్నారు. రాష్ట్రంలో రైతులకు ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ చైర్మన్ పట్లోళ్ల కృష్ణారెడ్డి, ఎంపీపీ విజయలక్ష్మి, జడ్పిటిసి మర్పల్లి మాలతి, చేవెళ్ల మార్కెట్ కమిటీ చైర్మన్ మిట్ట వెంకట రంగారెడ్డి, ఆర్డీవో వేణు మాధవరావు,మండల అధ్యక్షులు పెద్దోళ్ల ప్రభాకర్, ఆలూరు సర్పంచ్ విజయలక్ష్మి నర్సింలు, చేవెళ్ల సర్పంచ్ శైలజాజిరెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచ్ల సంఘం అధ్యక్షులు శేరి శివారెడ్డి, ఎంపీటీసీల సంఘం అధ్యక్షులు రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.