అర్హులైన జర్నలిస్టులకు ఇండ్లు, ఇళ్ల స్థలాలు కేటాయించండి..

అర్హులైన జర్నలిస్టులందరికి ఇండ్లు, ఇళ్ల స్థలాలను కేటాయించాలని టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు మిద్దెల సత్యనారాయణ డిమాండ్ చేశారు.

Update: 2023-05-04 12:18 GMT

దిశ, షాద్ నగర్ : అర్హులైన జర్నలిస్టులందరికి ఇండ్లు, ఇళ్ల స్థలాలను కేటాయించాలని టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు మిద్దెల సత్యనారాయణ డిమాండ్ చేశారు. టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన రిలేనిరాహార దీక్షలో భాగంగా గురువారం షాద్ నగర్ మండల పరిషత్ కార్యాలయం ఎదుట నిర్వహించిన దీక్ష కార్యక్రమంలో షాద్ నగర్ డివిజన్ అధ్యక్షకార్యదర్శులు మల్లేష్, నరేష్, ట్రెజరీ నరసింహారెడ్డి, శ్రీనివాస్, లక్ష్మణ్, రమేష్, మల్లేష్, శివ, భరత్, చంద్ర తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం కోసం టీడబ్ల్యూజేఎఫ్ నిరంతరం పోరాటం చేస్తుందని అన్నారు.

ఫోర్త్ ఎస్టేట్ గా చెప్పుకోబడే మీడియాపై ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని, జర్నలిస్ట్ సంక్షేమానికి పాటుపడుతూ న్యాయపరమైన కోరికలను అమలు పరచాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల పై రాష్ట్ర ప్రభుత్వం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తుందని, జర్నలిస్టులు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ మీడియా రంగంలో రాణిస్తున్నారని, దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న జర్నలిస్టుల డిమాండ్లను నెరవేర్చాలని సత్యనారాయణ కోరారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా సంతకాల సేకరణ, శాసనసభ్యులకు వినతి పత్రాలు, జిల్లా కార్యాలయం ఎదుట నిరాహార దీక్షలకు శ్రీకారం చుట్టిందని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు మల్లేష్, నరేష్, నాయకులు నరసింహారెడ్డి, శ్రీనివాస్, లక్ష్మణ్, రమేష్, మల్లేష్, శివ, భరత్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News