అమిత్ షా తెలంగాణకు వచ్చేది కేసీఆర్ ని తిట్టడానికేనా ?

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆదివారం తెలంగాణలో జరిగే విజయ సంకల్ప యాత్ర, భారీ బహిరంగ సభకు వస్తున్న సందర్బంగా చేవెళ్ల మండలకేంద్రంలో ఉన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పట్లోళ్ల ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.

Update: 2023-04-22 15:55 GMT

దిశ, చేవెళ్ల : కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆదివారం తెలంగాణలో జరిగే విజయ సంకల్ప యాత్ర, భారీ బహిరంగ సభకు వస్తున్న సందర్బంగా చేవెళ్ల మండలకేంద్రంలో ఉన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పట్లోళ్ల ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ ఇంద్రారెడ్డి ఘాటైన వాక్యాలు చేశారు. తొమ్మిది సంవత్సరాల కాలంలో తెలంగాణకు బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందని వారు ప్రశ్నించారు. మీరు చెప్పుకోవడానికి ఏముందని మూడుసార్లు పర్యటిస్తున్నారన్నారు. కేసీఆర్ ఒక విజన్ తో పనిచేస్తారని రాష్ట్రంలో ప్రవేశపెట్టిన మిషన్ కాకతీయ పథకంతో చెర్లు కుంటలు కత్వా కాలువలు పల్లెలన్నీ నిండుకుండలా ఉన్నాయన్నారు. పల్లె ప్రగతిని పంచే ఈ పథకాన్ని దేశమంతట విస్తరింప చేయగలరా..! అని వారి ప్రశ్నించారు.

కాళేశ్వరం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించినందుకా.! అని వారన్నారు. తెలంగాణ రాష్ట్రానికి రైల్వే కోచ్ మెడికల్ కాలేజెస్ నవోదయ స్కూల్స్ ఇవ్వలేమని చెప్పడానికి వస్తున్నారా అన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాలకు 84 నవోదయ పాఠశాలలు ఇచ్చి తెలంగాణకు ఎందుకు ఇవ్వలేరని వారు మండిపడ్డారు. ముఖ్యంగా సాగులో వెనుకబడి ఉన్న రంగారెడ్డి జిల్లా ప్రాంతానికి బీజేపీ ఎం.చేసిందని వారి ప్రశ్నించారు. మీకు తెలంగాణ ప్రజలపై ప్రేమ ఉంటే పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఐటీఐఆర్ వెనక్కి ఇవ్వగలరా..!అని వారు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలపై బీజేపీ వివక్ష చూపిస్తుందన్నారు. వరదలు వచ్చి హైదరాబాద్ అతలాకుతలం అయితే చిల్లి గవ్వ ఇవ్వలేరన్నారు. తెలంగాణ అభివృద్ధిలో ఇసుమంత కూడా బీజేపీ భాగస్వామ్యం లేదన్నారు. రేపు జరిగే సభలో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టె మాటలు మాట్లాడకుండా మీరు వెళ్లగలరా.! అని ఆమె సూటిగా ప్రశ్నించారు.

స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ దేశంలో ఉన్న ఏ ఒక్క వర్గానికి కూడా బీజేపీ న్యాయం చేయలేదన్నారు. దళితులకు మహిళలకు కార్మికులకు రైతులకు ఏం చేశారని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు పథకాన్ని కాపీ కొట్టి రెండు మూడు వేలు ఇస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 33 జిల్లాలకు నూతన కలెక్టర్ కార్యాలయాలను నిర్మించిన ఘనత కేసీఆర్ అన్నారు. జిల్లాకు ఒక కలెక్టర్ ను ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో బీజేపీ ఉందన్నారు. కేసీఆర్ రాష్ట్రంలో ఐదు వేల క్లస్టర్లను ఏర్పాటు చేసి ఏఈఓలను పెట్టి 25 లక్షలతో రైతు వేదికలను నిర్మించామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఉత్తమ గ్రామపంచాయతీ హోదా తెలంగాణలోని గ్రామాలు పొందుతున్నాయన్నారు. కాళేశ్వరం పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టులను జాతీయ హోదా రద్దు చేసినందుకు వస్తున్నారా..? అని వారు ప్రశ్నించారు. ఎన్ని కుట్రలు చేసిన ఏది ఏమైనా కేసీఆర్ వెంటే ప్రజలు ఉంటారన్నారు. మూడోసారి గెలిచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా హ్యట్రిక్ కొట్టనున్నారని వారు ధీమా వ్యక్తం చేశారు.

Tags:    

Similar News