'ప్రగతి నివేదన యాత్రకు జననీరాజనాలు'
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే తనయుడు, బీఆర్‌ఎస్ రాష్ట్ర యువనాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్‌రెడ్డి చేపట్టిన ప్రగతి నివేదన యాత్ర 500 కి.మీ. పూర్తి చేసుకుంది.
దిశ, తుర్కయంజాల్ : ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే తనయుడు, బీఆర్‌ఎస్ రాష్ట్ర యువనాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్‌రెడ్డి చేపట్టిన ప్రగతి నివేదన యాత్ర 500 కి.మీ. పూర్తి చేసుకుంది. బుధవారం ప్రశాంత్‌రెడ్డి పాదయాత్ర తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోకి చేరుకోగానే మన్నెగూడ వద్ద ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పైలాన్‌ను ఆవిష్కరించి, మొక్కను నాటి, కేక్ కట్ చేశారు. అనంతరం మన్నెగూడ, రాగన్నగూడ మీదుగా బ్రాహ్మణపల్లి ఎక్స్‌రోడ్డు నుంచి తుర్కయంజాల్ వరకు సాగింది. అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన సభలో ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి సహకారంతో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం శరవేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు.
ఫార్మా, ఐటీ సహా అనేక పరిశ్రమలు ఇక్కడ ఏర్పాటు అవుతున్నాయన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో రూ.2,391కోట్లతో అభివృద్ధి పనులు పూర్తిచేశామన్నారు. కేసీఆర్, కిషన్‌రెడ్డి నాయకత్వానికి మద్దతిస్తే భవిష్యత్‌లో మరిన్ని అభివృద్ధిపనులు జరుగుతాయన్నారు. ఇక తుర్కయంజాల్ మున్సిపాలిటీలో కొందరు నాయకుల మూలంగా అభివృద్ధి కుంటుపడిందన్నారు. పక్క మున్సిపాలిటీలు అభివృద్ధి చెందుతుంటే ఈ మున్సిపాలిటీలో మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉందన్నారు. కాంగ్రెస్ నాయకులు అభివృద్ధి నిరోధకులుగా మారారని, వారికి రాజకీయాలు తప్ప అభివృద్ధి అవసరం లేదన్నారు. ప్రజలుఅన్ని విషయాలు గమనిస్తున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య, రైతుబంధు జిల్లా చైర్మన్ వంగేటి లక్ష్మారెడ్డి, బీఆర్‌ఎస్ తుర్కయంజాల్ అధ్యక్షుడు వేముల అమరేందర్‌రెడ్డి, సీనియర్ నాయకులు కందాడ లక్ష్మారెడ్డి, ముత్యంరెడ్డి, నోముల కృష్ణగౌడ్, కందాల బలదేవరెడ్డి, సామ సంజీవరెడ్డి, ఫ్లోర్ లీడర్ కల్యాణ్‌నాయక్, కౌన్సిలర్లు కీర్తనావిజయానంద్‌రెడ్డి, సంగీతమోహన్‌గుప్తా, జ్యోతి జంగయ్య, భాగ్యమ్మధన్‌రాజ్, నాయకులు కొత్తకుర్మ కార్తీక్, గుండ్ల రాజిరెడ్డి, కొంతం యాదిరెడ్డి, కొల్లూరు నిరంజన్‌రెడ్డి, కందాడ సురేందర్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.