మృతదేహాన్ని గుర్తుపడితే..ఇక్కడికి రండి! పరిగి ఎస్ఐ సంతోష్ కుమార్
గుర్తు తెలియని వాహనం ఢీ కొని ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు.

దిశ, పరిగి: గుర్తు తెలియని వాహనం ఢీ కొని ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. పరిగి ఎస్ఐ. సంతోష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం..పరిగి మండలం రంగంపల్లి వైపు నుంచి పరిగికి ఓ గుర్తు తెలియని వ్యక్తి గురువారం రాత్రి నడుచుకుంటూ వస్తున్నాడు. నరసింహ కాటన్ మిల్లు దగ్గర హైవే 163 పై గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. తీవ్ర గాయాలైన వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.
మృతదేహాన్ని పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో భద్రపరిచామని ఎస్ఐ సంతోష్ తెలిపారు. మృత దేహాన్ని ఎవరైనా గుర్తుపడితే పరిగి పోలీస్ స్టేషన్ లో సంప్రదించాలని ఎస్ఐ సంతోష్ తెలిపారు.