రహదారుల అభివృద్ధితోనే ప్రగతివైపు అడుగులు..
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇవ్వడంతోనే ప్రగతివైపు వేగంగా అడుగులు పడుతున్నాయని ఇబ్రహీంట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు.
దిశ, యాచారం : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇవ్వడంతోనే ప్రగతివైపు వేగంగా అడుగులు పడుతున్నాయని ఇబ్రహీంట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. ఎలిమినేడు నుంచి ఇబ్రహీంట్నం డబుల్ రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే గురువారం పరిశీలించారు. ఈ సందర్బంగా ఎమ్మల్యే కిషన్ రెడ్డి మాట్లాడుతూ హైద్రాబాద్ కి ఇబ్రహీంపట్నం నగరానికి కూతవేటు దూరంలో ఉన్నా గతంలో ఒక్క డబుల్ రోడ్డు నిర్మాణానికి నియోజకవర్గం నోచుకోలేదన్నారు.
గడిచిన గత ఎనిమిది సంవ్సరాలలో ఇబ్రహీంట్నం అభివృద్ధి కోసం రూ. 508 కోట్లు మంజూరు అవ్వగా , నంది వనపర్తి నుంచి మేడిపల్లి వరకు గల రోడ్డు ని్మాణానికి రూ. 40. కోట్లు అయ్యాయన్నారు. మారు మూల పల్లెలన్నింటికీ దాదాపుగా అద్భుతమైన డబుల్ రోడ్లను, తారురోడ్లను నిర్మించగలిగామని అన్నారు. నందివనపర్తి నుండి మేడిపల్లి రూ.9.60 ఆగాపల్లి నుండి తులేకలాన్ కు రూ. 3.09 కోట్లతో రెండు వరుసల రహదారుల విస్తరణ పనులు పురోగతిలో ఉన్నాయని చెప్పారు. అద్భుతమైన రహదారుల నిర్మాణంతోనే పారిశ్రామికవేత్తలు ఇబ్రహీంట్నం వైపు దృష్టి సారించారని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లాగ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, ఎంపీపీ కృపేష్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.