Ibrahimpatnam MLA : డ్రైనేజ్ సమస్యలు ,రోడ్డు సమస్యలు శాశ్వతంగా తీరుస్తాం
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ లో మరిన్ని నిధులు
దిశ, ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ లో మరిన్ని నిధులు కేటాయిస్తామని డ్రైనేజ్ సమస్యలు ,రోడ్ల సమస్యలు శాశ్వతంగా తీరుస్తామని ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అన్నారు. మంగళవారం రోజు ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున TUFIDC నిధులు రూ.8 కోట్ల 9 లక్షలతో మున్సిపాలిటీ 2,6,9,10,12,14,20,21,22,24, వార్డులలో పలు అభివృద్ధి కార్యక్రమాలను కొబ్బరికాయలు కొట్టి, శిలాఫలకాలను ప్రారంభించారు. ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, మున్సిపల్ చైర్మన్ కప్పరి స్రవంతి చందు మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలను అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, సీసీ రోడ్లు, వీధిలైట్లు సమస్య తీరుస్తామన్నారు. ఇంటింటికి మంచినీళ్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి మరి కొద్ది రోజులలో అధిక నిధులను కేటాయించి సమస్యలు తీరుస్తామని, భాగ్యనగర్లో నెలకొన్న అండర్ డ్రైనేజ్ సమస్యను తొందరలోనే నిధులు కేటాయించి పనులు మొదలు పెడతామని కాలనీ వాసులకు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైస్ చైర్మన్ బర్ల మంగా జగదీశ్వర్ యాదవ్ కౌన్సిలర్లు ఇంద్రాల రమేష్, భాను గౌడ్ ఆకుల మమత, ఆనంద్, ఈర్లపల్లి సునీత, వెంక రెడ్డి, పంది శంకరయ్య, మహమ్మద్ సుల్తానా బేగం, సీనియర్ నాయకులు గురునాథ్ రెడ్డి, కప్పరి లక్ష్మయ్య, పాండురంగారెడ్డి, పాశం అశోక్ గౌడ్, పెద్దిగారి శ్రీకాంత్, తాళ్ల మహేష్ గౌడ్, చింతం రమేష్, ఈగల రాములు, శశిధరప్ప, సోమే,శ్ అప్ప కుమార్, అప్ప, సొప్పరి రవి, కప్పరి రాజు, దొంతరమోని రాజు, అధికారులు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.