రంగారెడ్డి జిల్లాలో హైడ్రా అధికారులు దూకుడు

రంగారెడ్డి జిల్లాలో హైడ్రా (Hydra) అధికారులు దూకుడు ప్రదర్శించారు. అక్రమంగా, అనుమతులు( illegal constructions) లేకుండా చేపట్టిన నిర్మాణాలను కూల్చివేశారు.

Update: 2025-02-08 07:38 GMT
రంగారెడ్డి జిల్లాలో హైడ్రా అధికారులు దూకుడు
  • whatsapp icon

దిశ, మహేశ్వరం: రంగారెడ్డి జిల్లాలో హైడ్రా (Hydra) అధికారులు దూకుడు ప్రదర్శించారు. అక్రమంగా, అనుమతులు( illegal constructions) లేకుండా చేపట్టిన నిర్మాణాలను కూల్చివేశారు. శనివారం ఉదయాన్నే రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు మున్సిపల్ ఆఫీసర్లతో కలిసి అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు. తుక్కుగూడ మున్సిపాలిటీ (Tukkuguda Municipality)మంఖాల్ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 139,140 లో అధికారులు చర్యలు చేపట్టారు. సూరన్ చెరువు ఎఫ్‌టీఎల్(Suran Pond Ftl) పరిధిలో ఫ్రీకాస్ట్‌తో నిర్మించిన కాంపౌండ్ వాల్, అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. ప్రస్తుతం ఈ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. సాయంత్రం వరకు ఎన్ని నిర్మాణాలు కూల్చివేశారనే దానిపై స్పష్టత రానుంది. 

Tags:    

Similar News