దిశ, జల్‌పల్లి: నా చావుకు భార్య, అత్త మామ, బావమరుదులే బాధ్యులని ఓ వివాహితుడు సుసైడ్ నోట్ రాసి మరీ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపుతుంది. మీర్‌పేట్ ఇన్‌స్పెక్టర్ మహేందర్ రెడ్డి వివరాల ప్రకారం.. బడంగ్‌పేట్‌కు చెందిన శ్రీరాముల శ్రవణ్‌కుమార్ (30), జనగామకు చెందిన రవళిని 2019 ఫిబ్రవరి 21వ తేదీన పెద్దల సమక్షంలో పెళ్ళి చేసుకున్నాడు. వీరికి రెండున్నరేళ్ల కూతురు జాహ్నవి ఉంది. ఇటీవల వారి మధ్య తరచూ గొడవలు ప్రారంభమయ్యాయి. దీంతో రవలి పుట్టింటికి వెళ్ళింది. తీసుకురావడానికి శ్రవణ్‌కుమార్ తన కుటుంబసభ్యులతో కలిసి ఇటీవల అత్తింటికి వెళ్ళాడు. అక్కడ రవళి బంధువులు వీరితో గొడవకు దిగారు. అనంతరం కొన్నిరోజుల తర్వాత రవళి తనకు తానుగా అత్తగారింటికి వచ్చింది. మళ్ళీ గొడవపడి ఆగస్టు 2021న వెళ్ళి తిరిగి రాలేదు.
ఈ క్రమంలో 20 రోజుల క్రితం రవళి తల్లిదండ్రులు, అన్నదమ్ములతో కలిసి తన భర్త శ్రవణ్ ఇంటికి వచ్చింది. భర్తతో గొడవపడి రూ.20 లక్షలు డిమాండ్ చేసింది. దీంతో శ్రవణ్‌కుమార్ ఇల్లు విక్రయించాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇల్లు విక్రయించయడానికి ప్రయత్నిస్తుండగా భార్య రవళి భర్తకు నోటీసులు పంపింది. దీంతో మానసిక వేధింపులు భరించలేక.. ''నా చావుకు భార్య రవళి, అత్త సావిత్రి, మామ వెంకటేష్, బావమరదులు నవీన్‌కుమార్, పవన్‌కుమార్‌లు బాధ్యులు'' అని సుసైడ్ నోట్ రాసి ఈనెల 20వ తేదీన రాత్రి 9 గంటల సమయంలో కాలనీలోని వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి కిందకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుని తల్లి అంజమ్మ ఫిర్యాదు మేరకు మీర్‌పేట్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. అనంతరం మృతుడి బెడ్ రూమ్ పరిశీలించిన పోలీసులకు సూసైడ్ నోట్ లభ్యమయ్యింది. ఈ కేసును మీర్‌పేట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.