బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ : నందిగామలో హీటెక్కిన రాజకీయం

నందిగామ మండల కేంద్రంలో 8వ తేది హత్ సే హత్ జోడో యాత్రతో నిర్వహించగా నందిగామ ఎంపీటీసీ కొమ్ము కృష్ణ యాత్రలో ప్రసంగిస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల జోలికి వస్తే నిన్ను వదిలి పెట్టనని హెచ్చరించారు.

Update: 2023-02-11 13:51 GMT

దిశ, నందిగామ : తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలను తలపిస్తున్న కార్యక్రమం కాంగ్రెస్ హత్ సే హాథ్ జోడో యాత్రతో నందిగామ మండల కేంద్రంలో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. జోడో యాత్ర లో భాగంగా 8వ తారీకున నందిగామ ఎంపీటీసీ కొమ్ముకృష్ణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల జోలికి వస్తే అంతు చూస్తామని బీఆర్ఎస్ నాయకులను వదిలి పెట్టం అని హెచ్చరించారు.

దానికి సవాలుగా బీఆర్ఎస్ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి బీఆర్ఎస్ నాయకులను విమర్శిస్తే నాలుక కోస్తామని హెచ్చరించారు. షాద్ నగర్ నియోజకవర్గం అభివృద్ధిలో ముందుకెళ్తుంది అన్నారు. మళ్ళీ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ నాలుక కోస్తే ఎవ్వరు ఊరుకోరని, మీ నాయకుని మీద వున్న రౌడీ షీటర్ తొలగించింది కాంగ్రెస్ అని మరవొద్దు, మీ నాయకుని చరిత్ర ఎంటో అందరికీ తెలుసని ఘాటు విమర్శలు చేశారు.

Tags:    

Similar News