పరివర్తన చెందితే రౌడీషీట్ తొలగింపు : జిల్లా ఎస్పీ కోటి రెడ్డి
నేర చరిత్ర కలిగి ఉండి రౌడీషీటర్ అనే ముద్ర కలిగిన వారిలో పరివర్తన వస్తే రౌడీషీట్ తొలగించేందుకు వీలుంటుందని జిల్లా కోటి రెడ్డి అన్నారు.
దిశ, పరిగి : నేర చరిత్ర కలిగి ఉండి రౌడీషీటర్ అనే ముద్ర కలిగిన వారిలో పరివర్తన వస్తే రౌడీషీట్ తొలగించేందుకు వీలుంటుందని జిల్లా కోటి రెడ్డి అన్నారు. పరిగిలోని స్వాగత్ రెసిడెన్సీలో సోమవారం ' హిస్టరీ షీటర్స్ మేళ ' 'నేరచరిత్ర కలిగన వ్యక్తుల మేళ ' కార్యక్రమం నిర్వహించారు. ఈ మేళాకు ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా ఎస్పీ ఎన్.కోటి రెడ్డి మాట్లాడుతూ వివిధ కారణాలతో నేరాలు చేసి రౌడీషీట్ పేరొందిన వ్యక్తలు ఎలాంటి అల్లర్లకు పాల్పడకుండా, క్రమశిక్షణ పొంది మార్పు వచ్చినట్లు నిరూపించుకుంటే వారిరై ఉన్న రౌడీషీట్ తొలగించుకునే అవకాశం ఉందన్నారు.
అంతేకుండా రౌడీషీట్ ఉన్న వ్యక్తలు అనారోగ్యానికి గురై, 60 ఏళ్లు పై బడిన వారు ఎస్ఐ, సీఐ, డీఎస్పీకి తొలగించాలని (ఆర్జీ) అభ్యర్తించవచ్చు. పరివర్తన రాకుండా అల్లర్లు కొనిసాగిస్తే వారిని రౌడీషీటర్లగానే పరిగినిస్తామన్నారు. అనంతరం వివిధ అంశాలపై రౌడీషీటర్ల అవగాహన కల్పించారు. పరిగి డీఎస్పీ కరుణా సాగర్ రెడ్డి, పరిగి, కోడంగల్ సీఐలు వెంకట్రామయ్య, బి.శంకర్, ఎస్ఐలు పి.విఠల్ రెడ్డి, భీం కుమార్, విశ్వజన్, గిరి, రవి, నయీం, రమేష్ తదితరులు పాల్గొన్నారు.