తాండూరు మండలంలో భారీ వర్షం.. వరద ఉధృతికి అంతర్రాష్ట్ర రాకపోకలు బంద్

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల తాండూరు వ్యాప్తంగా శుక్రవారం సాయంత్రం నుంచి ఆదివారం వరకు భారీ నుంచి మోస్తారు వర్షాలు దంచికొడుతున్నాయి.

Update: 2024-09-01 05:31 GMT

దిశ, తాండూరు : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల తాండూరు వ్యాప్తంగా శుక్రవారం సాయంత్రం నుంచి ఆదివారం భారీ నుంచి మోస్తారు వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. తాండూరు మండలం కోత్లాపూర్, ఐనేల్లి, అల్లాపూర్ వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో కర్ణాటక, తెలంగాణ అంతర్రాష్ట్రలకు రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే బేల్కటూరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

భారీ వర్షాల కారణంగా అల్లాపూర్ వాగు వరద ఉధృతకు లారీ బోల్తా పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అనేకచోట్ల వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. చాలా గ్రామాలకు రాకపోకలు కూడా నిలిచిపోయాయి. దీంతో అల్లాపూర్ వాగు వరద ఉధృతను కరణ్ కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డి పరిశీలించి వాహనదారులకు పలు సూచనలు చేశారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌లందరూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌నిహెచ్చ‌రించారు.


Similar News