చోరీకి గురైన క్యాబ్‌ను పట్టించిన జీపీఎస్ యాప్..
డ్రైవర్ పై కత్తితో దాడి చేసి ఓ దొంగ క్యాబ్‌తో ఉడాయించాడు.
దిశ, బడంగ్పేట్ : డ్రైవర్ పై కత్తితో దాడి చేసి ఓ దొంగ క్యాబ్‌తో ఉడాయించాడు. ఈ ఘటనలో జీపీఎస్ యాప్ లో ఉన్న ఇంజన్ కట్ ఆఫ్ పహాడిషరీఫ్ పోలీసులు క్యాబ్ దొకికేలా చేసింది. పహాడిషరీఫ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కంచన్‌బాగ్, హఫీజ్‌బాబానగర్ కు చెందిన మీర్జా ఆజంబేగ్ (21) వృత్తి రిత్యా క్యాబ్ డ్రైవర్. ఈ నెల 6వ తేదీన తెల్లవారు జామున 12.45 గంటలకు యూబర్ యాప్‌లో వచ్చిన మెసేజ్ప్రకారం టీఎస్ 09 యు.డీ 4323 నెంబర్ గల మారుతి కారులో మీర్జా ఆజంబేగ్ ఇద్దరు వ్యక్తులను ఎల్బీనగర్ వద్ద పికప్ చేసుకున్నాడు.
అనంతరం శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వస్తుండగా మార్గమధ్యలో ఎయిర్ పోర్ట్‌లో డ్రైవర్ పై కత్తితో దాడికి పాల్పడ్డారు. అనంతరం వారు క్యాబ్‌తో ఉడాయించారు. జరిగిన విషయాన్ని తన కారు యజమాని అజ్మత్కు వివరించాడు. వెంటనే యజమాని జీపీఎస్ యాప్ ద్వారా చెక్ చేయగా క్యాబ్ బేగంబజార్‌లో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఇంజన్ కట్ ఆఫ్ చేయడంతో కారు బేగంబజార్‌లోనే ఆగిపోయింది. వెంటనే కారును వదిలి నిందితులు పరారయ్యారు. లొకేషన్ ద్వారా కారును గుర్తించిన పోలీసులు చోరీకి గురైన క్యాబ్‌ను రీకవరీ చేశారు. దాడికి పాల్పడిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ కేసును పహాడిషరీఫ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.